ధనప్రయోదశి తర్వాత దేశవ్యాప్తంగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. దీంతో ఆదివారం దీపావళికి ముందు షాపింగ్ చేద్దాం అనుకుంటున్న ప్రజలకు శనివారం పెరిగిన రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయటానికి ముందుగా తమ నగరాల్లోని మారిన రేట్లను పరిశీలించి ముందుకు సాగటం బెటర్.
నవంబర్ 7న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 11 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 357గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 160గా కొనసాగుతోంది.
ALSO READ : నువామా లాభం 26 శాతం జంప్..
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 7, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షల 5 వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.205 దగ్గర ఉంది.
