ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పన్నెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన ఊరట దక్కింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ చీరాల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో సత్తా చాటింది. చీరాల మున్సిపాలిటీలోని మొత్తం 44 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 42 వార్డులలో అభ్యర్థులను నిలబెట్టి 10 వార్డుల్లో హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. వైసీపీ కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుని చీరాలలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. వైసీపీ 8 వార్డులను గెలుచుకుంది.
ఏపీలో రాజకీయంగా పట్టు నిలుపుకోవడానికి పన్నెండేళ్లుగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చీరాల మున్సిపాలిటీలో 10 వార్డుల గెలుపు భారీ ఊరటనిచ్చింది. స్థానిక రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ బలమైన నాయకత్వం కాంగ్రెస్ పది వార్డుల్లో గెలుపునకు దోహదపడిన అంశాలని స్థానికంగ చర్చ జరుగుతోంది. చీరాల మున్సిపాలిటీని కూటమి దక్కించుకున్నా అంతకు మించిన ఆనందం కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమైంది. చీరాల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. చీరాలలో పార్టీ ప్రచారాన్ని ముందుండి నడిపించిన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పీఏసీ సభ్యుడు ఆమంచి కృష్ణ మోహన్‌ను అభినందించారు.
చీరాల మున్సిపాలిటీని కూటమి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 44 కౌన్సిలర్ స్థానాలకు గాను టీడీపీ కూటమికి 25 స్థానాలు లభించాయి. తెలుగుదేశం పార్టీ సొంతంగా 22 వార్డులు గెలుచుకోగా మిత్రపక్షాలైన జనసేన 2, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పది స్థానాలను గెలుచుకోగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 8 స్థానాలతో మూడో ప్లేస్ లో నిలిచింది. ఇండిపెండెంట్ ఒక్క చోట గెలుపొందారు.
వార్డుల వారీగా గెలిచిన పార్టీలు:
Ward 1: కాంగ్రెస్
Ward 2: వైసీపీ
Ward 3: వైసీపీ
Ward 4: వైసీపీ
Ward 5: టీడీపీ
Ward 6: టీడీపీ
Ward 7: టీడీపీ
Ward 8: కాంగ్రెస్
Ward 9: టీడీపీ
Ward 10: వైసీపీ
Ward 11: వైసీపీ
Ward 12: టీడీపీ
Ward 13: టీడీపీ
Ward 14: టీడీపీ
Ward 15: కాంగ్రెస్
Ward 16: టీడీపీ 374
Ward 17: వైసీపీ
Ward 18: వైసీపీ
Ward 19: కాంగ్రెస్
Ward 20: టీడీపీ
Ward 21: కాంగ్రెస్
Ward 22: టీడీపీ
Ward 23: టీడీపీ
Ward 24: టీడీపీ
Ward 25: కాంగ్రెస్
Ward 26: టీడీపీ
Ward 27: బీజేపీ
Ward 28: జనసేన
Ward 29: టీడీపీ
Ward 30: టీడీపీ
Ward 31: జనసేన
Ward 32: ఇండిపెండెంట్ 148
Ward 33: కాంగ్రెస్
Ward 34: వైసీపీ
Ward 35: టీడీపీ 776
Ward 36: టీడీపీ
Ward 37: టీడీపీ 627
Ward 38: టీడీపీ
Ward 39: టీడీపీ
Ward 40: కాంగ్రెస్
Ward 41: టీడీపీ
Ward 42: టీడీపీ 150
Ward 43: కాంగ్రెస్
Ward 44: కాంగ్రెస్
- టీడీపీ: 22
- జనసేన: 2
- బీజేపీ: 1
- వైసీపీ: 8
- కాంగ్రెస్: 10
- ఇండిపెండెంట్: 1
