విశాఖ స్టీల్ ప్లాంట్ లో 11 మంది ఉద్యోగులు సస్పెండ్.. మిల్స్ విభాగంలో ఉత్పత్తి తగ్గడంతో..!

విశాఖ స్టీల్ ప్లాంట్ లో 11 మంది ఉద్యోగులు సస్పెండ్.. మిల్స్ విభాగంలో ఉత్పత్తి తగ్గడంతో..!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది యాజమాన్యం. కర్మాగారం మిల్స్ విభాగంలో ఉత్పత్తి తగ్గిందనే కారణంతో శుక్రవారం ( నవంబర్ 6 ) ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యాజమాన్యం. అర్థరాత్రి ఉద్యోగుల సస్పెన్షన్ కి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి ఆదేశాలు అందజేసిన అధికారులు వారి ఐడీలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిల్స్ విభాగంలో ఉత్పత్తి తగ్గితే తగిన చర్యలు తీసుకోవాలి కానీ.. ఉన్నట్టుండి సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు.

ఈ మధ్యకాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఏపీకి సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో వివాదాలు తలెత్తకుండా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.