Diwali 2026: దీపావళి పండుగ.. ఆనందాల ఫెస్టివల్.. కొన్ని కొత్త ఐడియాస్ మీకోసం...!

Diwali 2026:  దీపావళి పండుగ.. ఆనందాల ఫెస్టివల్.. కొన్ని కొత్త ఐడియాస్ మీకోసం...!

పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపుతుంది. ఇంటిల్లిపాదిని కలుపుతుంది. కొత్త ఆశలు, ఆలోచనలను తెప్పిస్తుంది. ఈసారి కూడా దీపావళి పండుగ ఆనందాల్ని మోసుకుని వస్తోంది. ప్రతి సంవత్సరం  జరుపుకునే పండుగే అయినా కొత్తగా చేసుకోవాలని ఉంటుంది కదా! అందుకు కొన్ని ఐడియాస్ మీకోసం..!

ప్లాస్టిక్ లైట్లు వద్దు: దీపావళి అంటేనే వెలుగుల పండుగ ఇంటా, బయటా వెలుగులు పూయిస్తాయి. అయితే ఈ మధ్య అందరూ ఎనర్జీ లైట్లు, వామ్ లైట్లు వాడటం మామూలైంది. వాటికి బదులుగా మట్టి దీపాలు వాడటమే మంచిది. ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. దీపాలను టెంపరరీగా కాకుండా కడిగి దాచుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు.వాటిపై డిజైన్లు కూడా వేసుకోవచ్చు. రోడ్డు పక్కన పేద వ్యాపారుల నుండి దీపాలను కొంటే వాళ్లు కూడా పండుగ హాయిగా జరుపుకుంటారు కదా..

వాకిట్లో రంగుల ముగ్గులు: ఇంటిముందు రంగుల ముగ్గులు వేయకుండా దీపావళి స్టార్ట్​ కాదు. కాబట్టి రంగుల ఎంపికలో తగ్గొద్దు. ఆయిల్ పెయింటింగ్​ లు ఎన్ని వేసినా అందంగా ఉండవు. అందుకే పువ్వులు, సుద్దముక్కలు, పసుపు, కుంకుమలతో ముగ్గులు. డిజైన్లు వేయాలి.
 
రీసైక్లింగ్: దీపావళికి చాలా మంది కొత్త సామాన్లు కొంటారు. అయితే వాటికన్నా ముందు ఇంట్లో ఉన్న పాతవాటిని రీసైకిల్ చేయాలి. బట్టలను, కుర్చీలను వస్తువులను కస్టమైజ్ చేయడం
ద్వారా వాటికి కొత్త లుక్ ఇవ్వొచ్చు.

స్వీట్లు: క్రాకర్స్ ఆకారంలో ఉండే వెరైటీ స్వీట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.