జ్యోతిష్యం:నాలుగు శుభయోగాలు ధన త్రయోదశి రోజు.. ఈ రాశుల వారికి అదృష్టం చెలరేగిపోతుంది..!

జ్యోతిష్యం:నాలుగు శుభయోగాలు ధన త్రయోదశి రోజు.. ఈ రాశుల వారికి అదృష్టం చెలరేగిపోతుంది..!

ధనత్రయోదశి  పర్వదినం రోజు నవంబర్​ 6 వ తేదీన  గ్రహాల ప్రత్యేక స్థితుల కారణంగా నాలుగు అత్యంత శుభప్రదమైన రాజయోగాలు ఏర్పడుతాయని జ్యోతిష్య పండితులు చెబుతుతున్నారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీ నారాయణ రాజయోగం, మాలవ్య రాజయోగం, బుధాదిత్య యోగం, త్రిగ్రాహి యోగాల ప్రభావంతో నాలుగు రాశుల (మేషం, తుల, ధనుస్సు, మకర )వారికి ఆర్థికంగా మంచి రోజులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .! 

  • లక్ష్మీ నారాయణ రాజయోగం: జాతకంలో బుధుడు, శుక్రుడు కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది అపారమైన ధనలాభాన్ని, సమాజంలో కీర్తి ప్రతిష్టలను, ఆర్థిక శ్రేయస్సును చేకూరుస్తుంది.
  •  మాలవ్య రాజయోగం: శుక్రుడు తన స్వరాశి అయిన తులారాశిలో సంచరించడం వల్ల ఈ అరుదైన పంచమహాపురుష యోగాలలో ఒకటైన మాలవ్య యోగం ఏర్పడుతుంది. ఇది భోగభాగ్యాలు, వాహన, గృహ సౌక్యాలు మరియు విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది.
  •  బుధాదిత్య యోగం: సూర్యుడు, బుధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం వ్యాపారంలో ఊహించని పురోగతిని, ఉద్యోగంలో పదోన్నతులను, సరైన నిర్ణయాలు తీసుకునే మేధోశక్తిని ఇస్తుంది.
  •  త్రిగ్రాహి యోగం: ఒకే రాశిలో (తులారాశిలో) సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలవడం వల్ల  త్రిగ్రాహీ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.


ఈ నాలుగు శుభయోగాల కలయిక వల్ల ముఖ్యంగా మేషం, తుల, ధనుస్సు, మరియు మకర రాశుల వారికి అదృష్టం కలిసిరావడమే కాకుండా ఆర్థికంగా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మేషరాశి: ధన త్రయోదశి రోజున ఏర్పడే నాలుగు శుభయోగాల వలన ఈ రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లక్ష్మీ నారాయణ, మాలవ్య రాజయోగాల ప్రభావంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.  కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఇక వ్యాపారస్తుల విషయంలో కొన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.  మొండి బాకీలు వసూలవుతాయి.  నిరుద్యోగులు శుభ వార్త వింటారు.  ప్రేమ వ్యహారం సాఫీగా కొనసాగుతుంది.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి ధంతేరస్ ఆర్థికంగా కలిసి రావచ్చు. లక్ష్మీ నారాయణ రాజయోగ ప్రభావంతో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని లేదా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి అనుకూల సమయం కావచ్చు. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తగ్గడంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.

తులారాశి.. ధన త్రయోదశి ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తులా రాశిలో త్రిగ్రాహి యోగం వలన ( శుక్రుడు, బుధుడు, సూర్యుడి)  ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఉద్యోగంలో కొత్త అవకాశాలు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకొనే వారి చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు కలుగుతాయి.  చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

మకర రాశి:  మాలవ్య రాజయోగం ప్రభావంతో ఈ రాశి వారికి చాలా  ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి గుర్తింపు వస్తుంది. కొత్త బాధ్యతలతో పాటు అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు, ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.