India vs Pakistan: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు (గురువారం, నవంబర్ 5, 2026) జరిగిన శాఫ్ (SAFF) ఛాంపియన్ షిప్ 2026 గ్రూప్-బి ప్రారంభ పోరులో భారత ఫుట్‌బాల్ జట్టు 3–2 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌పై అదరిపోయే విక్టరీ సాధించింది. దాయాదిపై గెలుపుతో గ్రూప్-బి పాయింట్ల పట్టికలో ఇండియా టాప్‌లోకి దూసుకెళ్లగా.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం (Handshake) చేసుకోవడం హాట్ టాఫిక్ గా మారింది.
ఫస్ట్ హాఫ్‌లో సుహైల్ భట్ ఊచకోత:
మ్యాచ్ ప్రారంభం నుంచే పాకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా వరుస గోల్స్‌తో విరుచుకుపడింది. ముఖ్యంగా సుహైల్ అహ్మద్ భట్ (Suhail Ahmad Bhat) మ్యాచ్ ప్రారంభమైన 14వ నిమిషంలో తొలి గోల్, 20వ నిమిషంలో రెండో గోల్ సాధించి భారత్‌కు 2–0 లీడ్ దక్కేలా చేశాడు. ఇక 32వ నిమిషంలో మంగ్లెన్‌థాంగ్ కిప్గెన్ (Manglenthang Kipgen) మూడో గోల్ సాధించి పాక్ డిఫెన్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో పాక్ కు లభించిన పెనాల్టీ చాన్స్ నాన్-కన్వర్ట్ కావడంతో (షాయక్ దోస్త్ మిస్ చేశాడు) టీమిండియా ఫస్ట్ హాఫ్ ని 3–0 లీడ్‌తో ముగించింది.
సెకండ్ హాఫ్‌లో పాక్ కమ్‌బ్యాక్ డ్రామా:
సెకండ్ హాఫ్‌లో పుంజుకున్న పాకిస్తాన్ మ్యాచ్ ముగిసే సమయంలో భారత్ పై తీవ్ర ఒత్తిడి పెట్టింది. అట్యాకింగ్ పెంచిన పాక్ తరఫున నజీబ్ ఉల్లా (91వ నిమిషం), ఆలమ్‌గిర్ ఘాజీ (94వ నిమిషం) ఇంజ్యూరీ టైమ్‌లో రెండు గోల్స్ కొట్టి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చారు. అయితే, భారత డిఫెండర్లు చివరి క్షణాల్లో అద్భుతంగా కంట్రోల్ చేసి, 3–2తో విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ఈ విజయంతో గ్రూప్-బిలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. తమ నెక్ట్స్ మ్యాచ్‌లో బుధవారం (నవంబర్ 11న) మాల్దీవులతో ఇండియా తలపడనుంది.
FT: Pakistan 2-3 India. This was painful to watch but hey at least Najeebullah and Alamgir Ghazi scored late. Pakistan now need a result against Maldives on 8 Nov to have any chance to reach SAFF Championship 2026 semfinals. #PAKvIND https://t.co/E4wFgmzDIw
— FootballPakistan.com (@FootballPak) November 5, 2026
🚨 FT: Pakistan 🇵🇰 2-3 🇮🇳 India INDIA BEAT PAKISTAN IN THEIR FIRST GAME OF THE SAFF CHAMPIONSHIP! 💫 https://t.co/Z1ovt6C8uE
— Chennaiyin Universal (@CFCUniversal) November 5, 2026
