రైతు భరోసా నిధులు విదుదల సందేశాలపై వ్యవసాయ శాఖ క్లారిటీ

రైతు భరోసా నిధులు విదుదల సందేశాలపై వ్యవసాయ శాఖ క్లారిటీ

 రైతు భరోసా నిధులు విడుదలయ్యాయంటూ  కొన్ని జిల్లాల్లో ప్రచారం జరుగుతోంది. నిధులు అకౌంట్లో జమ అయినట్లు  రైతులకు బుధవారం (2026 నవంబర్ 4) ఉదయం సందేశాలు వచ్చినట్లు వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చింది. దీనిపై వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది. 

రైతులకు నిధులు విడుదలైనట్లు వచ్చిన మెసేజ్ లపై విచారణ జరిపారు అధికారులు. దీనిపై సంబంధిత సాంకేతిక సంస్థలతో చర్చించారు.  టెక్నికల్ డిపార్ట్మెంట్ తో చర్చించాక.. ఈ మేసేజీలు వ్యవసాయశాఖ ద్వారా రైతులకు వెళ్లలేదని నిర్ధారించారు. ఇలాంటి వార్తలను రైతులు నమ్మరాదని సూచించారు. రైతు భరోసా నిధుల విడుదల అంశం ప్రభుత్వం నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. 

సైబర్ నేరస్తులు ఏదైనా పన్నాగం పన్నారా అని అనుమానిస్తున్నారు. దీని వెనుక  ఉన్న నిజానిజాలను నిర్ధారించేందుకు  సైబర్  క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ విభాగానికి వ్యవసాయ శాఖ లేఖ రాసింది.