Allu Arjun: ఇది సినిమా కాదు మన సంస్కృతి, మన గర్వం.. రణబీర్ కపూర్ 'రామాయణ' టీమ్ కు బన్నీ బెస్ట్ విషెస్!

Allu Arjun: ఇది సినిమా కాదు మన సంస్కృతి, మన గర్వం.. రణబీర్ కపూర్ 'రామాయణ' టీమ్ కు బన్నీ బెస్ట్ విషెస్!

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ'. నితేశ్ తివారీ దర్శకత్వంలో  భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం చిత్రబృందానికి తన మద్దతు ప్రకటించారు. సోషల్  మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

'రామాయణ' టీమ్ కు అల్లు అర్జున్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతికి ప్రతిరూపం. భారతీయ సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రయత్నం అంటూ ప్రశంసిస్తూ  పోస్ట్ చేశారు. మన కథలు, మన సంస్కృతి, మన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే ఇలాంటి గొప్ప ప్రయత్నానికి అందరం ఒక్కటై మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ చివర్లో 'జై శ్రీరామ్' అంటూ సందేశాన్ని ముగించారు. దీంతో బన్నీ వ్యాఖ్యలు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 

 తొలుత ఈ 'రామాయణ'ను మూడు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ భావించారట. అయితే కథకు తగ్గట్టుగా రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు. రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో, ఎలాంటి తొందరపాటు లేకుండా రూపొందించేందుకు అదనపు సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. వాస్తవానికి రెండో భాగాన్ని 2027లో విడుదల చేయాలని భావించినప్పటికీ, దానిని 2028కు వాయిదా వేస్తున్నట్లు వచ్చిన సమాచారం అభిమానుల్లో చర్చకు దారితీసింది.

►ALSO READ | టబు ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నేనే.. అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్!

 అయితే భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, కథకు తగిన గ్రాండ్ ఫినాలే అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని నిర్మాత వివరించారు.  ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్‌లతో పాటు సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మరి భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అంతర్జాతీయ స్థాయిలో మేకర్స్ ఎలా ఆవిష్కరించారో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..