Sreeleela: సూపర్‌స్టార్‌ రజనీతో శ్రీలీల.. తమిళంలో వరుస అవకాశాలు.. హిట్‌ కోసం ప్రయత్నాలు!

Sreeleela: సూపర్‌స్టార్‌ రజనీతో శ్రీలీల.. తమిళంలో వరుస అవకాశాలు.. హిట్‌ కోసం ప్రయత్నాలు!

టాలీవుడ్ యంగ్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు (Sreeleela) ప్రస్తుతం విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. వరుస సినిమాలు చేసినా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతోంది. దీంతో ఈసారి తమిళ చిత్ర పరిశ్రమపై గట్టిగా ఫోకస్‌ పెట్టింది. అక్కడ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ధనుష్‌తో ‘ఓమ్‌ చాప్టర్‌ 1: ఉదిరమ్‌’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. రజనీ హీరోగా దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కిస్తున్న ‘ధర్మన్‌’ (Dharman) లో శ్రీలీల నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘‘షీ ఈజ్‌ గాట్‌ ద స్పార్క్‌.. షీ ఈజ్‌ గాట్‌ ద పటాకా’’ అంటూ ఆమెకు వెల్కమ్ చెప్పింది.

రజనీతో శ్రీలీల.. ‘ధర్మన్‌’లో ఎలాంటి పాత్ర?

రజనీకాంత్‌ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధర్మన్‌’ను కమల్‌ హాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, టర్మరిక్‌ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఓ వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆయన పాత్రలో ఎలాంటి ప్రత్యేకత ఉంటుంది? కథలో ఆయనకు ఎదురయ్యే సవాళ్లేంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీలీల పాత్రకు సంబంధించిన వివరాలను మాత్రం చిత్రబృందం వెల్లడించలేదు. రజనీతో ఆమె స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుండటంతో ఈ కాంబినేషన్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.

తమిళంలో వరుస అవకాశాలు.. హిట్‌ కోసం ప్రయత్నాలు!

తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు ఇటీవల ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటోంది. ధనుష్‌తో ‘ఓమ్‌ చాప్టర్‌ 1: ఉదిరమ్‌’లో నటిస్తోంది. అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు రజనీకాంత్‌ ‘ధర్మన్‌’లో అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు మరింత ప్లస్‌ అయ్యే అంశం. అంతేకాకుండా అజిత్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి ఈ సినిమాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరవ్వడంతో పాటు అక్కడ బలమైన గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే శివ కార్తికేయన్ తో పరాశక్తి మూవీ చేసింది..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SREELEELA (@sreeleela14)

భారీ తారాగణం.. అనిరుధ్‌ మ్యూజిక్‌పై అంచనాలు!

‘ధర్మన్‌’లో శ్రీలీలతో పాటు నయనతార, సిమ్రాన్‌, రాశీఖన్నా, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌ పోతినేని పేరు కూడా ఈ సినిమా తారాగణం విషయంలో వినిపిస్తోంది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇక అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. రజనీకాంత్‌ సినిమాలకు అనిరుధ్‌ అందించే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా రజనీ ఎలివేషన్‌ సన్నివేశాల్లో ఆయన సంగీతం థియేటర్లలో అభిమానులకు మంచి కిక్‌ ఇస్తుంటుంది. మరి ‘ధర్మన్‌’ కోసం అనిరుధ్‌ ఎలాంటి పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సిద్ధం చేస్తారో చూడాలి.

►ALSO READ | Netflix Trending Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తున్న టాప్ 10 సౌత్ సినిమాలు.. ఈ వీకెండ్‌కు ఇవే బెస్ట్ ఛాయిస్..!

వరుస పరాజయాల తర్వాత శ్రీలీలకు రజనీకాంత్‌ లాంటి సూపర్‌స్టార్‌ సినిమాలో అవకాశం రావడం కెరీర్‌ పరంగా కీలక పరిణామమే. ధనుష్‌, రజనీకాంత్‌ వంటి అగ్ర హీరోల సినిమాలతో తమిళంలో అడుగులు వేస్తున్న ఈ బ్యూటీకి ఈ ప్రాజెక్టులు ఎలాంటి విజయాలను అందిస్తాయో వేచి చూడాలి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SREELEELA (@sreeleela14)