సినీ అభిమానుల కోసం 6 am షోలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. అదే విధంగా రోజూ 5 ఆటలు వేసుకునేలా తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 నవంబర్ 3వ తేదీన విజయ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
లేటెస్ట్ ఆర్డర్ ప్రకారం.. ఏదైనా సినిమా రిలీజైన మొదటి వారంలో ఐదు షోలు నడుపుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి తెల్లవారు జామున 2.30 గంటల వరకు సినిమాలు నడిపించుకునే వెసులుబాటు కల్పించింది.
అంతేకాకుండా.. వీకెండ్స్ (వారాంతం), నేషనల్ , స్టేట్ హాలిడేస్ (సెలవు రోజులు) లో ఆరు షోలు వేసుకోవచ్చునని పేర్కొంది.
ప్రస్తుతం తమిళనాడులో అన్ని థియేటర్లు ఉదయం 9 గంటలకు ప్రారంభమై రోజులో 4 షోలు వేసుకునేందుకే పరిమితులు ఉన్నాయి.
సూర్య నటించిన సీన్, నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న మూకుతి అమ్మాన్2 సినిమాలు నవంబర్ 6న విడుదల కానున్నాయి. ఈ నిర్ణయంతో బెనిఫిట్ అయ్యే మొదటి రెండు సినిమాలు ఇవే కావచ్చు.
మార్నింగ్ షో బ్యాన్ చేసిన డీఎంకే:
గతంలో కూడా మార్నింగ్ షోలు ఉండేవి. అయితే రోహిణీ సిల్వర్ స్క్రీన్ లో అజిత్ సినిమా తునివు సెలబ్రరేషన్స్ సందర్భంగా ఒక అభిమాని అప్పట్లో చనిపోయాడు. దీంతో నిబంధనలు కఠినతరం చేసి.. మార్నింగ్ షో ఎత్తేసింది అప్పటి డీఎంకే ప్రభుత్వం.
