విశ్వక్‌సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోన్న సినిమా ‘ఈఎన్‌ఈ రిపీట్’. అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడులైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా రిలీజైన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచేసింది.
ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా ఫ్రెండ్షిప్, కామెడీ, ఎమోషన్స్‌తో ట్రైలర్ సాగింది. ఒక సినిమా తీయాలనే ప్రయత్నంలో స్నేహితులు ఎదుర్కొనే పరిణామాలు, ఆ క్రమంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు, ఊహించని ట్విస్టులు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ మార్క్ నేచురల్ కామెడీ, క్యాచీ డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ, వినోదాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ALSO READ : 17 మంది చిన్నారుల అదృశ్యం.. అర్జున్ దాస్ 'జాన్ డో' ట్రైలర్ చూస్తే వణుకుపుట్టాల్సిందే!
మొత్తానికి కథా నేపథ్యం నుంచి కామెడీ, ట్విస్టుల వరకు ప్రతి అంశం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మరి ‘ఈ నగరానికి ఏమైంది’ మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ మరోసారి రిపీట్ చేస్తుందా? అనేది తెలియాలంటే నవంబర్ 19 వరకు వేచి చూడాల్సిందే!
