విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47 (AK 47)’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే నాలుగో రోజు మాత్రం కలెక్షన్లలో భారీ తగ్గుదల కనిపించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం వర్కింగ్ డే అవ్వడంతో థియేటర్స్‌లో ఆడియన్స్ హవా తగ్గింది. అందులోనూ మరో రెండ్రోజుల్లో దీపావళి వస్తుండటంతో.. ‘చూద్దాంలే అన్నట్టుగా’ ఫ్యామిలీ ఆడియన్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమా కలెక్షన్లపై ఆసక్తి నెలకొంది..
నాలుగో రోజు ఏం జరిగింది?
అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారం వసూళ్లు మరింత పెరిగాయి. నిర్మాతలు ప్రకటించిన లెక్కల ప్రకారం మూడు రోజుల్లోనే రూ.75 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. దీంతో వెంకటేష్ అభిమానుల్లో సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరుతుందనే ఆశలు పెరిగాయి.
అయితే సోమవారం నుంచి పరిస్థితి మారింది. నాలుగో రోజు ఇండియాలో రూ.3.40 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం వసూళ్లతో పోలిస్తే దాదాపు 69.8 శాతం తగ్గుదల నమోదైందని తెలిపాయి. సోమవారం 2,981 షోల ద్వారా ఈ వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే సినిమా నాలుగు రోజుల్లో రూ. 80 కోట్లకి పైగా గ్రాస్, 42 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
Every family has its own stories, but this one comes with EXTRA entertainment! 😂😉 Catch the BLOCKBUSTER FAMILY ENTERTAINER #AadarshaKutumbam at theatres near you now!❤️🔥 Book your tickets for #AK47 Now! 🎟️ https://t.co/AUZPFdKiSU 🎟️ https://t.co/cLl1YH3yEn https://t.co/lQ240yRaep
— Haarika & Hassine Creations (@haarikahassine) November 3, 2026
దీపావళి సెలవులపైనే ఆశలన్నీ!
వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గినప్పటికీ దీపావళి పండుగ సెలవులు సినిమాకు కలిసొస్తాయని చిత్ర బృందం ఆశిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తే వసూళ్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజులు సినిమా బాక్సాఫీస్ ప్రయాణంలో కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో కలెక్షన్లు పెరిగితే రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే దిశగా సినిమా ముందుకు వెళ్లవచ్చు.
త్రివిక్రమ్ ఫస్టాఫ్ అదుర్స్.. సెకండాఫ్ విషయంలో మాత్రం!
సినిమా చూసిన ప్రేక్షకుల్లో కొందరు త్రివిక్రమ్ మార్క్ ఫస్టాఫ్‌ను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కామెడీ, కుటుంబ నేపథ్యంలోని సన్నివేశాలు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. అయితే సెకండాఫ్‌లో మరింత గ్రిప్పింగ్ క్రైమ్ ఎలిమెంట్స్, బలమైన కామెడీ ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశం లాంగ్ రన్ వసూళ్లపై ప్రభావం చూపుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి మూడు రోజుల్లోనే రూ.75 కోట్ల గ్రాస్‌తో సత్తా చాటిన ‘ఆదర్శ కుటుంబం’ నాలుగో రోజు మాత్రం గట్టి పరీక్షను ఎదుర్కొంది. ఇప్పుడు దీపావళి సెలవులే సినిమాకు కీలకం. మరి వెంకటేష్ తన మార్క్‌తో బాక్సాఫీస్ వద్ద మళ్లీ పుంజుకుంటారా? రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడతారా? అనేది చూడాలి.
