ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన సంగీతం అందించిన భారీ చిత్రంcరామాయణ’ నుంచి ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాట చుట్టూ మొదలైన చర్చ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పాటలోని మ్యూజిక్ స్టైల్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు రెహమాన్ చేసిన ప్రయోగానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన రెహమాన్.. విమర్శకులకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. అందరినీ మెప్పించాలనే ఆలోచనతో సంగీతం చేయలేమని చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అందరినీ మెప్పించడం నా వల్ల కాదు..
‘రామాయణ’ పాటలపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడిన రెహమాన్.. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించినప్పటికీ, అందరి అభిరుచులకు తగ్గట్టుగా సంగీతాన్ని రూపొందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పిన ఓ ఆసక్తికరమైన మాటను గుర్తుచేసుకున్నారు. ‘మీరు అందరినీ సంతృప్తిపరచాలనుకుంటే ఐస్‌క్రీమ్ అమ్ముకోండి’ అనే కొటేషన్ను ప్రస్తావించారు. అంటే, ఒక కళాకారుడు తన క్రియేటివిటీని పక్కనపెట్టి ప్రతి ఒక్కరికీ నచ్చేలా మాత్రమే పనిచేయడం సాధ్యం కాదన్నది ఆయన అభిప్రాయం. ఒకరికి నచ్చిన పాట మరొకరికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన ప్రతి ఒక్కరి అభిప్రాయానికి అనుగుణంగా తన సంగీతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని రెహమాన్ మాటలు చెబుతున్నాయి.
పాటలు కూడా ఊరగాయల్లాంటివే.. టైమ్ పడుతుంది!
ఈ సందర్భంగా రెహమాన్ చెప్పిన మరో ఉదాహరణ అందరినీ ఆకట్టుకుంటోంది. కొన్ని సంగీత కంపోజిషన్స్‌ను ఆయన ఊరగాయతో పోల్చారు. ఊరగాయ తయారు చేసిన వెంటనే దాని అసలు రుచి తెలియకపోవచ్చు. కొంతకాలం గడిచిన తర్వాత దాని రుచి మరింత బాగుంటుంది. కొన్ని పాటల విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ట్యూన్స్ మొదటిసారి విన్నప్పుడు అంతగా నచ్చకపోయినా, మళ్లీ మళ్లీ వింటున్న కొద్దీ వాటిలోని ప్రత్యేకత అర్థమవుతుందని వివరించారు. అందుకే ఏదైనా పాటను ఒక్కసారి విని వెంటనే జడ్జ్ చేయకూడదని సూచించారు. అంతేకాదు.. ఒక పాటలోని చిన్న భాగాన్ని మాత్రమే చూసి మొత్తం కంపోజిషన్‌పై అభిప్రాయం ఏర్పరచుకోవడం సరికాదని అన్నారు. ఆ పాట వెనుక ఉన్న అసలు ఆలోచన, సినిమా కథలో దాని ప్రాధాన్యత, ఇతర సన్నివేశాలతో దానికి ఉన్న సంబంధం తెలుసుకున్నప్పుడు సంగీతంలోని ప్రత్యేకత అర్థమవుతుందని చెప్పారు.
If you want to satisfy everyone, go sell ice cream.” 🍦✨ A.R. Rahman breaks his silence on the Ramayana music debate! Here is how the Maestro reacted to the initial backlash over Mangal Rang: 🔥 The Ultimate Clapback Quoting Steve Jobs, Rahman made it clear, creators can’t please everybody. He isn't sweating every hot take online! 🥒 Music is Like a Pickle Just like fine wine or traditional pickles, Rahman believes complex compositions take time to mature. "For certain tunes, the older it is, the better it becomes." 🎧 ⚡ His Own Harsh Critic He spends months living with a piece before release. "People see one side, not the whole picture." 🎼 Global Scale Ahead Teaming up with Hans Zimmer, Rahman teased that this two-part epic holds "10 movies' worth of work" across Hollywood and Indian versions. 🌎💥 Give a fine composition time to breathe! 🎶 What’s your take on Mangal Rang? 👇 #ARRahman #Ramayana #MangalRang #HansZimmer #BollywoodMusic
— @WealthWisdomWave (@Djeykarthik) November 3, 2026
‘మంగళ్ రంగ్’ పాటపై ఎందుకింత చర్చ?
నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ సినిమాలోని ‘మంగళ్ రంగ్’ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడు, సీతాదేవి వివాహ ఘట్టాన్ని అందంగా చూపించే ఈ పాటలో అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ తమ గాత్రంతో మ్యాజిక్ చేశారు. ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ ఈ పాటకు సాహిత్యం అందించారు.
అయితే పాటలోని సంగీత కూర్పుపై మాత్రం కొంతమంది శ్రోతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఖవ్వాలీ ( ఇస్లామిక్ సంగీతం) తరహా మ్యూజిక్ వినిపిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రామాయణం వంటి గొప్ప ఇతిహాసానికి సంబంధించిన పాటలో మరింత సంప్రదాయబద్ధమైన సంగీతం ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
►ALSO READ | OTT Review: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్.. గర్భిణి చుట్టూ మంత్రాలు, చేతబడులు..
మరికొందరు మాత్రం రెహమాన్ చేసిన కొత్త ప్రయోగాన్ని ప్రశంసిస్తున్నారు. ఒకే తరహా సంగీతానికి పరిమితం కాకుండా కొత్త స్టైల్‌లో పాటను రూపొందించడం ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. దీంతో ఈ పాటపై సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
రావణుడి తాండవం మ్యూజిక్‌పైనా నెటిజన్ల అసంతృప్తి!
‘మంగళ్ రంగ్’ పాటతో పాటు రావణుడి తాండవానికి సంబంధించిన సంగీతంపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. రావణుడి పాత్రలో యష్ కనిపించనుండటంతో ఈ సీక్వెన్స్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి పవర్‌ఫుల్ పాత్రకు తగ్గట్టుగా సంగీతం మరింత ఉగ్రంగా, ఎనర్జిటిక్‌గా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. అయితే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ టచ్‌తో రూపొందించిన సంగీతం తాము ఊహించిన స్థాయిలో లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు సినిమా మొత్తం చూసిన తర్వాతే ఇలాంటి సంగీత ప్రయోగాలపై ఒక అంచనాకు రావాలని మరికొందరు సూచిస్తున్నారు.
మొత్తానికి ‘మంగళ్ రంగ్’ పాటపై వచ్చిన విమర్శలు, వాటికి రెహమాన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒక పాటను వెంటనే అంచనా వేయకుండా, దాని వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకోవాలని ఆయన చెప్పిన మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి థియేటర్లలో ‘రామాయణ’ విడుదలైన తర్వాత రెహమాన్ సంగీతం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. కాగా ఈ సినిమా మరో రెండ్రోజుల్లో నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
