ఇక గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ సెంటర్ల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం!

ఇక  గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ సెంటర్ల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం!

దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం పంచాయతీరాజ్ శాఖ, సీఈఎస్ఎల్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఈ ఒప్పందం ద్వారా, పంచాయతీల ఖాళీ భూముల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల పంచాయతీలకు అదనపు ఆదాయం లభించడంతో పాటు, పెట్రోల్, డీజిల్ పై ఆధారపడటం తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఉండగా, ఈ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.

ALSO READ : మురసు తుఫాన్ తీరం దాటింది.. తెలంగాణకు భారీ వర్ష సూచన..

ఈ ఒప్పందం ప్రకారం.. పంచాయతీ ప్రాంగణాలు, జాతీయ, రాష్ట్ర హైవేల పక్కన ఉన్న స్థలాలు సహా తగిన ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ శ్వాపింగ్‌ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు మీడియం, హెవీ వాహనాలకు ఉపయోగపడేలా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.