శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత వృద్ధి చెందుతున్నా కొందరు మాత్రం మూఢ నమ్మకాల ఊబి నుంచి బయటపడటం లేదు. మూఢ నమ్మకాల మూలాన కన్న బిడ్డలను చంపుకుంటున్నారు. గుజరాత్లో జరిగిన ఈ ఘటన గ్రామీణ భారతంలో మూఢ నమ్మకాలు ఇప్పటికీ ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి రుజువు చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని వించియా గ్రామంలో నరేష్ అనే వ్యక్తి భార్య, పదేళ్ల కొడుకుతో కలిసి ఉంటున్నాడు.
నరేష్ ఒక భువ. భువ అంటే మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్లు. వీళ్లు దేవతలతో మాట్లాడగలరని, ఆవాహన చేయగలరని స్థానికులు నమ్ముతారు. క్షుద్రపూజలు చేసేవారిని భువ అని పిలుస్తారు. నరేష్ తండ్రి కూడా ఒక భువనే. నరేష్ తన కొడుకు మాత్రం భువగా మారకూడదని కోరుకున్నాడు. ఈ తాంత్రిక విద్యలు తనతోనే ముగిసిపోవాలని, తన కొడుకు ఈ తాంత్రిక విద్యలు నేర్చుకోకూడదని నరేష్ భావించాడు. అయితే.. కొన్ని నెలలుగా నరేష్ కొడుకు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.
తాంత్రికుడిలా మారిందని, అయితే ఈ పదేళ్ల తన కొడుకు కుటుంబ సంప్రదాయాన్ని పాటించడం తనకు ఇష్టం లేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. నరేష్ జోగ్ని మాత ఆలయానికి తన కొడుకును తీసుకెళ్లాడు. పదేళ్ల కొడుకును అమ్మవారి పీఠానికి ఒకటికి మూడు సార్లు కొట్టాడు. కర్రతో దాడి చేసి చంపేశాడు. తన కన్న కొడుకును చంపేసిన నరేష్ అతనిని ఇంటికి తీసుకెళ్లి ఆరు బయట మంచంపై పడుకోబెట్టాడు. కొడుకు శవాన్ని ఒక మంచంపై ఉంచి, పక్కన మరో మంచంపై నిద్రపోతున్న స్థితిలో నరేష్ కనిపించడంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
