ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక భారత జాతీయుడు మరణించగా.. మరో పర్యాటకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం (నవంబర్ 3) ఉదయం ఎవరెస్ట్ రీజియన్ పరిధిలోని సోలుఖుంబు జిల్లా ఖుంబు పసాంగ్ లాము రూరల్‌లోని ఫెరిచే హెలిప్యాడ్ దగ్గర ఈ సంఘటన జరిగింది.
అధికారుల వివరాల ప్రకారం.. ఫెరిచే హెలిప్యాడ్‌లో ల్యాండింగ్ అవుతుండగా ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనస్టీ ఎయిర్‌లకు చెందిన హెలికాప్టర్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో రెండు హెలికాప్టర్ల రోటర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించగా.. మరో విదేశీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న అధికారులు, సహయక బృందాలు ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టాయి.
మృతుడిని 47 ఏళ్ల భారతీయ పర్యాటకుడు వసంత్ కుమార్ బలర మడుగా గుర్తించారు. మృతదేహాన్ని ప్రభు ఎయిర్ హెలికాప్టర్‌లో లుక్లాకు తీసుకువచ్చారు. గాయపడిన ప్రయాణికుడిని భారత సంతతికి చెందిన 53 ఏళ్ల న్యూజిలాండ్ పౌరుడైన శైలేష్ కిషన్ పటేల్‌గా గుర్తించారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం మౌంటెన్ హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఫిష్‌టెయిల్ ఎయిర్ హెలికాప్టర్ పైలట్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, స్థానిక పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ల్యాండింగ్ సమయంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికి ఒకటి ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
नेपाल के माउंट एवरेस्ट क्षेत्र में आज सुबह लैंडिंग के वक्त दो हेलीकॉप्टर आपस में टकराए। इस हादसे में एक यात्री की मौत हो गई है। यह हादसा नेपाल के सोलुखुम्बू जिले के बर्फीले इलाके में हुआ। https://t.co/WM3EmVsXkF
— Sachin Gupta (@Sachingupta) November 3, 2026
