బియ్యం రేట్లు పెంచితే కఠిన చర్యలు.. రైస్ మిల్లర్స్, హోల్‌‌‌‌‌‌‌‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు ....నిబంధనలు పాటించాలి

బియ్యం రేట్లు పెంచితే కఠిన చర్యలు.. రైస్ మిల్లర్స్, హోల్‌‌‌‌‌‌‌‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు ....నిబంధనలు  పాటించాలి
  • జగిత్యాల జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్చరిక

జగిత్యాల టౌన్, వెలుగు: బియ్యాన్ని అక్రమంగా దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినా, రేట్లు పెంచి అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్వో జితేందర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని రైస్ మిల్లులు, హోల్‌‌‌‌‌‌‌‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డిప్యూటీ తహసీల్దార్లు, ఫుడ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే వ్యాపారులపై నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీ లేబుళ్లను మార్చడం చట్టరీత్యా నేరమని, బ్రాండెడ్ బ్యాగుల్లో నాణ్యత లేని బియ్యాన్ని నింపి మోసగించినట్టయితే చర్యలు తీసుకుంటామన్నారు. 

తక్కువ బియ్యం నింపి 26 కిలోల బస్తాల పేరిట అమ్మితే తూనికలు కొలతల చట్టం కింద చర్యలుంటాయన్నారు. ప్రతి మిల్లు, షాపు ఎదుట రోజువారీ నిల్వలు, ధరల బోర్డు ప్రదర్శించాలని, ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఐ లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలన్నారు.