AP Election 2026: ఆంధ్రప్రదేశ్‎లో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు.. పోలింగ్ ఎప్పుడంటే..?

AP Election 2026: ఆంధ్రప్రదేశ్‎లో MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు.. పోలింగ్ ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నవంబర్ 3న జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి.

సవరించిన షెడ్యూల్ ఇదే

  • నవంబర్ 5 (గురువారం): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.
  • నవంబర్ 6: అవసరమైన చోట రీపోలింగ్.
  • నవంబర్ 7 (శనివారం): ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.