జైపూర్: రాజస్థాన్‌లో తీవ్ర విషాధ ఘటన చోటు చేసుకుంది. ఝున్ఝును జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల్లో విద్యుత్ ఘాతంతో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయ్పూర్వతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛపోలి గ్రామంలో సోమవారం (నవంబర్ 2) ఉదయం ఈ ఘటన జరిగింది.
రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తీసుకొచ్చిన కంకర (గ్రావెల్) మిక్స్ చేసే యంత్రానికి హైటెన్షన్ కరెంట్ వైర్లు తగిలాయి. దీంతో ఆ యంత్రం మొత్తానికి కరెంట్ వ్యాపించింది. ఈ క్రమంలో ఆ యంత్రాన్ని పట్టుకోవడంతో ఎనిమిది మంది కూలీలు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటవీ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేసేందుకు స్థానికులు చందాలు సేకరించి ప్రైవేట్‌గా ఈ నిర్మాణ పనులను చేపట్టగా ఈ దుర్ఘటన చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
