ఈ వీకెండ్ ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, గ్యాంగ్‌స్టర్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, హారర్ వంటి విభిన్న జానర్లలో ఐదు ఆసక్తికరమైన కంటెంట్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అక్టోబర్ 28 నుంచి 30 మధ్య నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటి? వాటి స్టోరీ బ్యాక్ డ్రాప్స్ ఏంటనేది ఓ లుక్కేద్దాం..
ధిండోరా సీజన్ 1 (Dhindora Season 1)..
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సిరీస్‌లలో ధిండోరా సీజన్ 1 ఒకటి. అక్టోబర్ 28న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో భువన్ బామ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఓ మధ్యతరగతి కుటుంబానికి అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు రావడంతో వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. డబ్బు వల్ల ఎదురయ్యే సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా సంఘటనలు ప్రేక్షకులను నవ్విస్తాయి. కామెడీని ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను ఎంచక్కా చూసేయొచ్చు..
బత్తా (Baththa)
విజయ్ సేతుపతి హీరోగా నటించిన బత్తా మూవీ అక్టోబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో పాటు కామెడీ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన చిత్రమిది. గ్యాంగ్‌స్టర్ జీవితంలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు, వాటి వల్ల ఎదురయ్యే పరిస్థితులు కథలో కీలకంగా ఉంటాయి. విజయ్ సేతుపతి నటన, కథలోని మలుపులు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం మంచి బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి..
అక్క (Akka)
క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారి కోసం అక్క సిరీస్.. అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు. 1980ల కాలం నాటి కల్పిత ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, ఆధిపత్యం, వ్యక్తిగత ఆశయాల మధ్య జరిగే పోరాటాలు ప్రధానంగా కనిపిస్తాయి. మహిళల ఆధిపత్యంలో నడిచే శక్తివంతమైన వ్యవస్థలో చోటుచేసుకునే పరిణామాలు కథను ముందుకు నడిపిస్తాయి. ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ, క్రైమ్ నేపథ్యం ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉత్కంఠభరితమైన కథలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి ఛాయిస్.
►ALSO READ | RC17: కృష్ణుడి లుక్‌లో రామ్‌చరణ్? నెమలి పింఛంలో దాగిన మెగా పవర్‌స్టార్ ముఖం.. సుక్కు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
మీఠే మే క్యా హై (Meethe Mein Kya Hai)
కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన కథలను ఇష్టపడేవారి కోసం మీఠే మే క్యా హై అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అపార్థాలు, మనస్పర్థలు, వాటిని అధిగమించి తిరిగి దగ్గరవ్వాలనే ప్రయత్నాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి. కుటుంబ బంధాల విలువను గుర్తుచేసే సంఘటనలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథనం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలవనున్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే ఈ సినిమా వైపు ఓ లుక్కేయొచ్చు..
ఇమ్మోర్టల్ (Immortal)
ఈ వీకెండ్‌లో హారర్, ఫాంటసీ జానర్‌లో వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ ఇమ్మోర్టల్. జి.వి. ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 30న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రేమకథతో మొదలయ్యే కథలో మిస్టరీ, అతీంద్రియ అంశాలు కీలకంగా మారతాయి. ఓ యువకుడి జీవితంలోకి ఓ యువతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకునే పరిణామాలు కథను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. రొమాన్స్‌తో పాటు భయానక అంశాలను కలిపి రూపొందించిన ఈ చిత్రం హారర్ సినిమాలను ఇష్టపడేవారికి బెస్ట్ ఛాయిస్..
మొత్తానికి.. ఇలా ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్‌లో విభిన్న జానర్లలో ఐదు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసాయి. కామెడీ కావాలనుకునేవారు ధిండోరా సీజన్ 1ను, గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం బత్తాను, క్రైమ్ థ్రిల్లర్ కోసం అక్కను, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం మీఠే మే క్యా హైను, హారర్ కోసం ఇమ్మోర్టల్‌ను చూసేయొచ్చు..
