Scene Trailer: దుమ్మురేపుతున్నసూర్య ‘సీన్’ తెలుగు ట్రైలర్‌.. క్రైమ్, కామెడీ, యాక్షన్‌తో ఊహించని ట్విస్ట్‌లు..

Scene Trailer: దుమ్మురేపుతున్నసూర్య ‘సీన్’ తెలుగు ట్రైలర్‌.. క్రైమ్, కామెడీ, యాక్షన్‌తో ఊహించని ట్విస్ట్‌లు..

డార్క్ కామెడీ.. డెడ్లీ యాక్షన్.. మర్డర్ మిస్టరీ.. వీటన్నింటికీ తోడు సూర్య మార్క్ మాస్ ఎలివేషన్స్‌ తో ‘సీన్’ (SCENE) ట్రైలర్‌ దుమ్మురేపుతోంది.  ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్’ తెలుగు ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచుతోంది. నస్లెన్‌ను పవర్‌ఫుల్ క్రిమినల్‌గా పరిచయం చేస్తూ, నజ్రియా నజీమ్‌ను యాక్షన్ అవతార్‌లో చూపించిన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అసలు హీరో సూర్య విధుల నుంచి తప్పుకోవాలనుకున్న పోలీస్ ఆఫీసర్ మళ్లీ ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? అతడికి ఎదురైన క్రిమినల్ ఎవరు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రూల్స్‌కు దూరం.. రిస్క్‌లకు సై అంటున్న పోలీస్..

విభిన్నమైన కథాంశాలు, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు జీతూ మాధవన్.. ఈసారి కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి ‘సీన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా రిలీజైన తెలుగు ట్రైలర్‌లో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్‌గా సరికొత్త అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రొటీన్ పోలీస్ క్యారెక్టర్‌కు భిన్నంగా, తనదైన రూల్స్‌తో వ్యవహరించే డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఆయన పాత్రను డిజైన్ చేశారు. డార్క్ కామెడీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

కెరీర్ పీక్‌లో ఉండగానే పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఇన్‌బరాజ్ నిర్ణయించుకోవడం కథలో ఆసక్తికరమైన మలుపుగా కనిపిస్తోంది. ఇంట్లో హాయిగా గడుపుతూ, పోలీస్ శాఖ నుంచి వచ్చే ఆదేశాలను సైతం పెద్దగా పట్టించుకోని ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకురావడానికి పైఅధికారులు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో చోటుచేసుకునే సన్నివేశాలు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ఉద్యోగం వదిలేసిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లాలనే తన ఆలోచనను ఇన్‌బరాజ్ బయటపెట్టడం కూడా ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సూర్య vs నస్లెన్.. క్రిమినల్‌తో హోరాహోరీ పోరు..

‘సీన్’లో నస్లెన్ ఈశ్వరన్ జోసెఫ్ అనే ప్రమాదకరమైన నేరస్థుడిగా కనిపిస్తున్నారు. అతడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారడంతో డీఎస్పీ ఇన్‌బరాజ్‌గా సూర్య రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాగే మైండ్ గేమ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. అసలు ఈశ్వరన్ వెనుక ఉన్న రహస్యాలేమిటి? అతడిని ఇన్‌బరాజ్ ఎలా పట్టుకుంటాడు? అన్న ఉత్కంఠను ట్రైలర్ మరింత పెంచుతోంది.

పనిమనిషిగా ఎంట్రీ.. యాక్షన్‌లో నజ్రియా హంగామా..

‘సీన్’లో నజ్రియా నజీమ్ మాయ అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇన్‌బరాజ్ ఇంట్లో పనిమనిషిగా పరిచయమయ్యే ఆమె.. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యర్థులను ధైర్యంగా ఎదుర్కొంటూ కనిపించడం మాయ పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. అసలు ఆమె నేపథ్యం ఏమిటి? కథలో ఆమె పాత్ర ఎలాంటి మలుపులకు కారణం కానుంది? అన్నది సినిమాలో చూడాల్సిందే.

‘ఆవేశం’ తర్వాత జీతూ మాధవన్ మరో ప్రయోగం..

‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్.. ‘సీన్’తో సూర్యను సరికొత్త అవతార్‌లో చూపిస్తున్నారు. డార్క్ కామెడీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ అంశాలను మేళవించిన తీరు ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. సీరియస్ కేసు చుట్టూ వినోదాన్ని జోడిస్తూ, అనూహ్యమైన మలుపులతో కథను నడిపించినట్లు కనిపిస్తోంది. జీతూ మాధవన్ మేకింగ్‌కు సూర్య మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

నవంబర్ 6న థియేటర్లలో ‘సీన్’ సందడి..

ఈ ఏడాది కరుప్పు(వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో హిట్స్ అందుకున్న సూర్య.. నెలల గ్యాప్‌లోనే ‘సీన్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. నవంబర్ 6న ‘సీన్’ దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డార్క్ కామెడీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. మరోవైపు, ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.