ప్రతి మానవుడు ఏదో ఒక సమయంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాడు. ప్రస్తుతం.. వ్యాధులు లేనివారు ప్రపంచంలో లేరనే చెప్పాలి. అయితే జ్యోతిష్యం ప్రకారం మనిషి చేసిన పాపకర్మల ఆధారంగా వ్యాధులు పట్టి పీడిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
మనిషి అనారోగ్యాలకు.. వ్యాధులు రావడానికి వారు చేసిన పాప కర్మల ఆధారంగా జాతక చక్రంలోని గ్రహాలు కారణమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అందుకే పూజలు.. పునస్కారాలు.. దానాలు మొదలగు వాటి ద్వారా వాటి తీవ్రతను తగ్గించుకుంటాం. సిద్ద నాగార్జున తంత్రం ప్రకారం.. ఏ గ్రహం ఎలాంటి వ్యాధులను కలుగజేస్తుందో తెలుసుకుందాం...!
ఒక్కోసారి ఎన్నిమందులు వాడినా కొన్ని వ్యాధులు తగ్గవు. ఇటువంటి పరిస్థితిలో ఆ వ్యాధి కారకమైన గ్రహాన్ని సంతృప్తిపరిచిన ఎడల .. ఆ వ్యాధికి వాడిన మందులు పని చేస్తాయని పండితులు చెబుతున్నారు. ముందు గ్రహాలకు దానం ఇవ్వాలి . అప్పటికి ఫలితం లేకుంటే తీవ్రతని బట్టి అభిషేకం నిర్వహించాలి. ఇంకా ఫలితం రాకుంటే జపం చేయించాలి. ఇంకా ఫలితం ఇవ్వకుంటే హోమం నిర్వహించాలి. ఇందులో ఏది అన్నది ఆ గ్రహ దోషం , వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది.
ALSO READ : Diwali special 2026: సాంకేతిక వెలుగుల్లో సంప్రదాయ దీపాలు..స్మార్ట్ లైటింగ్, డిజిటల్ గ్రీటింగ్స్
ఉదాహరణకు చూడండి.. కరోనా సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి కోట్లాది మంది ప్రాణాలతో బయటపడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే వారు గతంలో చేసిన దానాల వలన వారు రక్షించబడ్డారని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఏ వ్యాధికి ఏ గ్రహం కారణమో తెలుసుకుందాం. . .
- గురుడు, బుధుడు: సన్నిపాత జ్వరం, టైఫాయిడ్, విషజ్వరం
- గురుడు, శుక్రుడు : కామెర్లు
- సూర్యుడు: రాచ కురుపు, ఎలర్జీ
- శని: మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు
- కుజుడు: అతిసారం , విరోచనాలు
- బుధుడు, శని , కేతువు : జీర్ణకోశంలో మంట, పుల్లటి తేన్పులు, పసుపు రంగులో విరేచనాలు ,మలంలో జిగురు లేదా శ్లేష్మం పడటం, జీర్ణక్రియ మందగించడం, వాంతులు
- కుజుడు , రాహువు: పైల్స్,బ్లీడింగ్ పైల్స్
- శని: అజీర్ణం
- కుజుడు: కలరా వ్యాధి
- శుక్రుడు, కుజుడు, రాహువు:క్షయవ్యాధి
- శని, బుధుడు,కేతువు: ఉబ్బసం, అస్తమా, శ్వాశకోస సమస్యలు
- శుక్రుడు : బ్రీతింగ్ సమస్య, గుండె సమస్యలు, మెదడుకు వెళ్లే నరాల్లో సమస్యలు,శ్వాసనాళాల్లో కఫం
- శుక్రుడు,రాహువు,చంద్రుడు,శని : బైపోలార్ డిజార్డర్ , వేగవంతమైన ఆలోచనలు, జన్యుపరమైన సమస్యలు, మెదడు పనితీరులో మార్పులు,ఒత్తిడి, సైకోగా ప్రవర్తించడం
- సూర్యుడు,శని, కుజుడు: ధనుర్వాతం,బాక్టీరియాల వల్లే కలిగే వ్యాధులు
- శని: పక్షవాతం
- కుజుడు,శని: ఫుడ్ పాయిజన్ వల్ల కలిగే వ్యాధులు, చల్లని లక్షణాలు,గొంతు మంట,నొప్పి కండరాలు,దగ్గు, గ్యాస్ సమస్యలు,వికారం,తీవ్రమైన కడుపు నొప్పి,మెడలో వాపు,శ్వాస ఆడకపోవడం
- బుధుడు,కేతువు : మూగతనం
- శని,శుక్రుడు: రుమటాయిడ్ ఆర్థరైటిస్
- శని : ఆహారం జీర్ణంకాకపోవడం, వాత సమస్యము, కీళ్ల నొప్పులు, కాళ్లు–చేతులు బిగుసుకుపోవడం, నిద్రలేవడంతోనే నరాల సమస్యలు, ఒళ్లు నొప్పులు, అలసట, శరీర బరువు తగ్గడం
- బుధుడు,కేతువు,కుజుడులు: మశూచి
- శని: చెవుడు
- కుజుడు,రాహువు : తలనొప్పి
- సూర్యుడు,గురుడు: గర్భస్రావం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
