నవంబర్ 3 నుంచి 4 వరకు.. హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో నీటి కష్టాలు తప్పవ్ !

నవంబర్ 3 నుంచి 4 వరకు.. హైదరాబాద్‌లో ఈ ఏరియాల్లో నీటి కష్టాలు తప్పవ్ !

హైదరాబాద్: నవంబర్ 3 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి అధికారులు తెలిపారు. గండిపేట కాండ్యూట్‌లో భారీ లీకేజీల మరమ్మతులకు జలమండలి చర్యలు తీసుకుంటుంది. సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ దగ్గర లీకేజీలకు మరమ్మతులు చేయాలని జలమండలి నిర్ణయించింది. నవంబర్ 3 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు ఈ మరమ్మతు పనులు జరుగుతాయి.

మొత్తం 36 గంటల పాటు ఈ మరమ్మతు పనులు కొనసాగనున్నాయి. గోషామహల్, కార్వాన్ సర్కిళ్ల పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని.. రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్ ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

  • అసెంబ్లీ, సెక్రటేరియట్, ఆదర్శ్‌నగర్, గన్‌ ఫౌండ్రీ ప్రాంతాల్లోనూ అంతరాయం
  • గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీలో సరఫరా నిలిపివేత
  • ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లోనూ నీటి కష్టాలు
  • కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడలో ప్రభావం
  • బంజారాహిల్స్ వార్డు పరిధిలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం