హైదరాబాద్: టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన విషాద ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతారం గ్రామంలో శనివారం (అక్టోబర్ 31) రాత్రి చోటుచేసుకుంది. తుర్కపల్లి నుంచి పోతారం గ్రామం వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న పొన్న కృష్ణ (54)ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణ మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. అందులో డ్రైవర్ ఒకరు యాక్సిడెంట్ చేసినట్లు ఒప్పుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడి కృష్ణ ట్రాక్టర్ డ్రైవర్ కాగా అతనికి ముగ్గురు పిల్లలు.
