జ్యోతిష్యం: నవంబర్ నెల.. వృషభరాశి వారు కెరీర్ లో అభివృద్ది.. ఉద్యోగ, వ్యాపార రంగంలో పురోగతి

జ్యోతిష్యం:  నవంబర్ నెల.. వృషభరాశి వారు కెరీర్ లో అభివృద్ది.. ఉద్యోగ, వ్యాపార రంగంలో పురోగతి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 నవంబర్​​ నెలలో కీలక గ్రహాలు స్థానాలు మారబోతున్నాయి.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఈ నెలలో వృషభరాశి వారి జీవితంలో  మిశ్రమ ఫలితాలతో  అనేక  పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ నెలలో ( నవంబర్​ 2026) వృషభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!

  •  నవంబర్ 6 (అర్ధరాత్రి 12:45 గంటలకు)  శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 14న  కన్యారాశిలో శుక్రుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 22 (సాయంత్రం 5:38 గంటలకు) శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశం
  •  నవంబర్ 12 (రాత్రి 8:30 గంటలకు) కుజుడు సింహ రాశిలోకి ప్రవేశం
  • నవంబర్ 13న   తులారాశిలో బుధుడు సంచారంలో దిశ మార్పు
  • నవంబర్ 16 (సాయంత్రం7:48 గంటలకు)సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం 
  •  నవంబర్ 25న రాహువు మకరరాశిలోకి ప్రవేశం

 వృషభ రాశివారికి నవంబర్ 2026లో  వృత్తి  ఆర్థిక పరమైన అంశాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో గ్రహాల స్థితిగతుల ఆధారంగా  ఈ నెలలో మీ కెరీర్ ఆశయాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది.  ఖర్చులు ..  ఆదాయం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గురు గోచారం వల్ల ఆర్థిక విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండటం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ప్రశాంతత కోసం కొంత సమయంచాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

పదకొండవ ఇంట్లో శని ఉండటం వల్ల లాభాలు, మద్దతు, అదృష్టం కెరీర్ పురోగతి పెరుగుతాయి
నాల్గవ ఇంట్లో బృహస్పతి ఖర్చులు  నివాసంలో మార్పులు జరిగే అవకాశం
 నాల్గవ ఇంట్లో కేతువు సంచారం వలన  కుటుంబలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.
శని బలమైన స్థానంలో సంచారం వల  ఆర్థిక లాభాలను, మెరుగైన పొదుపులను, కెరీర్ వృద్ధిజరిగే అవకాశంఉంది. ఐదు,ఆరు ఇళ్లలో శుక్రుడు సంచరించడం సృజనాత్మకత, ప్రేమ మరియు స్థిరత్వం పెరుగుతుంది. 

 

ALSO READ : జ్యోతిష్యం: నవంబర్ నెల కీలక గ్రహాల మార్పు..

 రాశ్యధిపతి శుక్రుడితో పాటు ఏకంగా అయిదు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందువల్ల నవంబర్ నుంచి ఈ రాశివారికి దశ తిరగడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసు కుంటాయి. 
ప్రేమ వ్యవహారాల్లో కొత్త అవకాశాలు చిగురిస్తాయి. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ క్రమబద్ధమైన జీవనశైలిని కొనసాగించాలి.

పరిహారం: ప్రతిరోజూ ఓం గురవే నమః అనే మంత్రాన్ని108 సార్లు జపం చేయాలి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.