జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పటికప్పుడు గ్రహాలు స్థానాలు మారుతుంటాయి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం 2026 అక్టోబర్ 30న బుధుడు.. కుజుడు 90 డిగ్రీల దూరంలోకి రానున్నారు. దీని ప్రభావంతో ఏర్పడే దృష్టి యోగం వలన ఐదు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. అసంపూర్తి పనులన్నీ ఈ కాలంలో విజయవంతంగా పూర్తవుతాయి
జ్యోతిష్య శాస్త్రప్రకారం బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన గ్రహం. కుజుడు శక్తి, ధైర్యం, కార్యసాధన, పోరాట పటిమ విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. దృష్టి యోగం వలన ప్రయోజనం కలిగే రాశుల వివరాల గురించి తెలుసుకుందాం. . !
మేష రాశి : బుధుడు.. కుజుడు మధ్య దృష్టి యోగం ఏర్పడటం వలనఈ రాశి వారిఇ అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆర్థికవిషయాల్లో చాలా సానుకూల మార్పులు ఉంటాయి. నిరుద్యోగులు శుభ వార్త వింటారు. ఉద్యోగస్తులకు వేతనంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా లాభాలు కలుగుతాయి. వ్యాపారం చేసే వారికి కొత్త పెట్టుబడులు వలన ఎక్కువల లాభాలు వచ్చే అవకాశం ఉంది. పాత అప్పులు తీరిపోతాయి. చాలా ఆనందంగా జీవిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: దృష్టి యోగం వలన ఈ రాశి వారికి సమాజంలో గౌరవం .. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమమయని పండితులు చెబుతున్నారు.వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కార మవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి : బుధుడు.. కుజుడు మధ్య ఏర్పడే దృష్టి యోగం వలన ఈ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం, భద్రత లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఉన్నత పదవి కోసం మరో సంస్థలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు జాబ్ ఆఫర్లు అందుతాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపడితే ఊహించని లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు జరుగుతాయి.ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఏ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : బుధుడు.. కుజుడు మధ్య దృష్టి యోగం వలన ఈ రాశి వారికిశ్రమకు తగిన ప్రతి ఫలం లభిస్తుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆఫీసులో మీరే కీలకం అవుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
మకర రాశి : దృష్టి యోగం వలన ఈ రాశి వారికి పాత పెట్టుబడుల నుంచి అనేక లాభాలు అందుకుంటారు. ప్రతి పనిలో కూడా అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నరు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆస్తికి సంబంధించి ఏదైన వివాదం నడుస్తుంటే అది పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లను మెప్పిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన పురోగతి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇది చాలా అనుకూలమైన సమయం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు శ్రీకారం చుట్టేందుకు అనువైన కాలం. కెరీర్ మెరుగుదల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
