పోలీసులు, లాఠీఛార్జీలకు భయపడొద్దు : ర్యాలీకి తరలిరావాలని యువతకు రాహుల్ పిలుపు

పోలీసులు, లాఠీఛార్జీలకు భయపడొద్దు : ర్యాలీకి తరలిరావాలని యువతకు రాహుల్ పిలుపు

ఇండియా కూటమి తలపెట్టిన ర్యాలీకి యువత తరలిరావాలని పిలుపునిచ్చారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేసులకు, లాఠీ చార్జీలకు భయపడకుండా 2026 నవంబర్ 1న జరిగే ర్యాలీలో ధైర్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆలోచనలు, హక్కులు అణచివేతకు గురవుతున్నాయని భావిస్తే పార్టీలను, సంఘాలను పక్కనపెట్టి ర్యాలీలో పాల్గొనాలని అక్టోబర్ 29న యువతను కోరారు. 

కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఓట్ చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తున్న ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలసిందే. ఓట్ల తొలగింపు ద్వారా మోదీ ప్రభుత్వం గెలుస్తూ వస్తోందని.. అందుకు సహకరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ను రాజీనామా డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 

ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో విభేదించినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక రాసిన నివేదిక తర్వాత ఇండియా కూటమి ఆందోళన స్థాయిని పెంచింది.  ఫామ్ 6 లో ఉన్న కొన్ని క్లాజులపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసింది కూటమి.

ఈ అంశంపై ఇప్పుడు కోర్టులో ఉంది. అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు నవంబర్ 1న మెగా ర్యాలీకి ఇండియా కూటమి సిద్ధమైంది. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రామ్ లీలాకు..

ప్రజస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రామ్ లీలా మైదాన్ కు వెళ్లాల్సిందేనని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఓట్ల దొంగతనాన్ని అడ్డుకోవడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కదం తొక్కాల్సిందేనని కోరారు. ఇది ఏ రాజకీయ పార్టీ కోసమో కాదు. భారత ఆత్మ కోసం చేసే యాత్ర. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ లపై విసిగిపోయిన వారంతా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

కేసులకు, లాఠీ ఛార్జీలకు భయపడవద్దు. బీజేపీ అంత దమ్ము లేదు. మాతా కలిసి ర్యాలీలో నడవండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ట్వీట్ చేశారు రాహుల్. 

సీఈసీ కి వ్యతిరేకంగా బహిరంగ అభిశంసన డిమాండ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది ఇండియా కూటమి. అక్టోబర్ 30న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాస స్థలం ఉండే రాజాజీ మార్గాన.. ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. దాని తర్వాత ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీ చలో మార్చ్ ఉంటుందని తెలిపారు.