మంత్రి అయ్యి ఉండి.. తిరుమలలో సాధారణ భక్తుడిగా ఉచిత దర్శనం

 మంత్రి అయ్యి ఉండి.. తిరుమలలో సాధారణ భక్తుడిగా ఉచిత దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనంలో ఓ ఆసక్తికర ఘటన. సాధారణంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు వీఐపీ బ్రేక్ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే తమిళనాడుకు చెందిన మంత్రి డి. శరత్ కుమార్ మాత్రం సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి  శరత్ కుమార్... ఎలాంటి ప్రత్యేక వీఐపీ దర్శనాన్ని ఆశ్రయించకుండా, సాధారణ భక్తులకు కేటాయించే ఎస్ఎస్‌డీ టైమ్ స్లాట్ టోకెన్‌తో శ్రీవారి దర్శనానికి వెళ్లారు.

సామాన్య భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధికార హోదా కంటే భక్తికే ప్రాధాన్యం ఇస్తూ, సాధారణ భక్తుడిలా శ్రీవారి దర్శనం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమలలో తమిళనాడు మంత్రి సాధారణ దర్శనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.