Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పోస్ట్ చేసిన ఒక క్రిప్టిక్ వీడియో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై ఇండియన్స్ వీడి సీఎస్కే గూటికి చేరుతున్నాడనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈరోజు (2026, అక్టోబర్ 27, మంగళవారం) కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్ (Zaheer Khan), అసిస్టెంట్ కోచ్‌లు (ఆల్బీ మోర్కెల్, మోహిత్ శర్మ, గారెత్ బాటీ), జట్టు మాస్కాట్ 'లియో'లతో కూడిన వీడియోను చెన్నై విడుదల చేయగా, అందులో ఒక సీక్రెట్ హింట్ దాగి ఉండటం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
జెర్సీ నెంబర్ 33 సీక్రెట్ కోడ్:
సీఎస్కే విడుదల చేసిన వీడియోలో మాస్కాట్ లియో.. కొత్త హెడ్ కోచ్ జహీర్ ఖాన్‌ను రాబోయే 'ట్రేడ్ అప్‌డేట్స్' (Trade Updates) గురించి ఒక కాగితం చూపిస్తూ ప్రశ్నిస్తుంది. జహీర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నిరాకరించినప్పటికీ, జూమ్ చేసి చూసిన అభిమానులకు ఆ కాగితంపై "33" అనే సంఖ్య సర్కిల్ (రౌండ్) చేసి ఉండటం స్పష్టంగా కనిపించింది.
* హార్దిక్ పాండ్యా జెర్సీ నంబర్: టీమిండియాతో పాటు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో హార్దిక్ పాండ్యా ధరించే జెర్సీ నంబర్ 33. దీంతో పాండ్యాను చెన్నై ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు పూర్తి చేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
►ALSO READ | ఐపీఎల్ 2027 కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీ ప్లాన్.. కొత్తగా ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌ల నియామకం
పక్కాగా ప్లాన్ చేశారు.. అశ్విన్ సంచలన ట్వీట్:
ఈ క్రిప్టిక్ వీడియోపై భారత మాజీ స్పిన్ దిగ్గజం, సీఎస్కే మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్)లో స్పందించాడు.. "Onnnnn?? Proper cooking" (ట్రేడ్ జరుగుతోంది.. సీఎస్కే సరిగ్గా ప్లాన్ చేస్తోంది) అని అశ్విన్ ట్వీట్ చేయడంతో ఈ రూమర్లు మరింత జోరందుకున్నాయి. అయితే, ఈ వీడియోపై ఫ్యాన్స్, క్రీడా విశ్లేషకులు డిస్కషన్ చేసుకుంటున్నప్పటికీ, సీఎస్కే లేదా ముంబై ఇండియన్స్ యాజమాన్యాలు హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
The way CSK just hyped Hardik’s trade. 🔥 It's happening boys. 💥 https://t.co/ifyEIRgBrT
— Pratyush Halder (@pratyush_no7) October 27, 2026
