నా భార్య నన్ను వదిలేసి.. ఫ్రీ బస్సు ఉందని వెళ్ళిపోయింది..! ఐదు రోజులు వెతికాను..!

నా భార్య నన్ను వదిలేసి.. ఫ్రీ బస్సు ఉందని వెళ్ళిపోయింది..! ఐదు రోజులు వెతికాను..!

ప్రభుత్వం మహిళల మంచి కోసం ఫ్రీ బస్సు స్కీం ప్రవేశ పెడితే.. కొంతమంది దాని అర్థాన్ని మార్చేసేలా వ్యవహరిస్తున్నారు. ఫ్రీ బస్సులో సీట్ కోసం మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న వీడియోలు, మగవారిని సీటులో నుంచి లేవమని రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చుశాం. ఇప్పుడు ఫ్రీ బస్సు మీద మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రీ బస్సు ఉందని తన భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని.. రూ.రెండు వేలు ఖర్చు చేసి ఐదు రోజులు వెతికానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు బాధితుడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెజ్జంకి మండలం రేగులపల్లిలో జరిగింది ఈ ఘటన. గ్రామానికి చెందిన కనకయ్య అనే వ్యక్తి తన భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని.. దయచేసి ఫ్రీ బస్సు తీసేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నాడు. ఫ్రీ బస్సు ఉందని తన భార్య వదిలేసి వెళ్లిపోయిందని..రూ. రెండు వేలు ఖర్చు చేసి ఐదు రోజులు వెతకాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు కనకయ్య.

కనకయ్య ఆవేదన చూసి అక్కడున్నవారు నవ్వాలో, అయ్యో పాపం అని జాలి పడాలో తెలియని స్థితిలో ఉండిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు నెటిజన్స్. ఆమె భర్తను వదిలి వెళ్లిపోవడానికి, ఫ్రీ బస్సు స్కీంకు సంబంధం ఏముందని కొందరు నెటిజన్స్ అంటుంటే... ఇలాంటి వారి వల్ల ఫ్రీ బస్సు ఉద్దేశం పక్కదారి పడుతోందని..వెంటనే ఆ పధకాన్ని రద్దు చేయాలని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.