ప్రియుడిపై మోజుతో ఇడ్లీలో విషం పెట్టి భర్తను చంపిన భార్య !

ప్రియుడిపై మోజుతో ఇడ్లీలో విషం పెట్టి భర్తను చంపిన భార్య !

కర్ణాటకలో షాకింగ్ ఘటన జరిగింది. మైసూరు జిల్లా హున్సూర్‌లో స్థానికులను విస్మయానికి గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త తిన్న ఇడ్లీలలో, చట్నీలో ఉమ్మెత గింజలను పొడి చేసి కలిపి అతని హత్యకు కుట్ర పన్నింది. తన ప్రియుడితో కలిసి ఈ ప్లాన్ను పక్కాగా అమలు చేసింది. పోలీసులు ఆ మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పవిత్ర (30), రామ ప్రసాద్ (35) భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. 11 ఏళ్ల కొడుకు, 9 ఏళ్ల కూతురితో కలిసి తమ సొంతూరు అయిన మైసూరు జిల్లా హున్సూర్లో ఉంటున్నారు. పవిత్రకు సునీల్‌ అనే వ్యక్తికి పరిచయం అయింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ క్రమంలోనే.. తమకు రామ ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతని అడ్డు తొలగించుకుంటే ఎంచక్కా కలిసి ఉండొచ్చని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడానికి పవిత్ర పథకం రచించింది.

అక్టోబర్ 16న పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తన భర్తకు వడ్డించిన ఇడ్లీలలో పవిత్ర విషపూరితమైన ఉమ్మెత గింజలను కలిపిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే.. ఆ విషం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఆమె తన ప్రియుడు సునీల్‌ను ఇంటికి పిలిచింది. వారిద్దరూ కలిసి రామ ప్రసాద్‌ను గొంతు నులిమి చంపేశారు.