Nani - Nithiin Movie: మెలోడీ మాయలో పడేస్తున్న 'రుకు రుకు రుక్మిణి'.. నితిన్ ఖాతాలో హిట్ పడ్డట్లేనా?

Nani - Nithiin Movie: మెలోడీ మాయలో పడేస్తున్న 'రుకు రుకు రుక్మిణి'.. నితిన్ ఖాతాలో హిట్ పడ్డట్లేనా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం'అలియాస్ రుక్మిణి'. ఈ  రొమాంటిక్ ఎంటర్ టైనర్ పై ఇప్పటికే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ మ్యూజికల్స్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు మేకర్స్ . ఈ సందర్భంగా 'రుకు రుకు రుక్మిణి' సాంగ్ ను రిలీజ్ చేశారు. 

ఈ  'రుకు రుకు రుక్మిణి' పాటలో హీరో ప్రేమలో పడిన క్షణాల్ని అందంగా ఆవిష్కరించారు. కోర్టులో పనిచేసే కృష్ణ (నితిన్).. స్కూల్ టీచర్ రుక్మిణి (ఆఫియా సయ్యద్)ను చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె అందం, మాటతీరు, వ్యక్తిత్వం అతడిని ఎలా మాయలో పడేశాయన్నది ఈ పాట ద్వారా ఆసక్తికరంగా చూపించారు. ప్రేమలో పడిన యువకుడి మనసులో సాగే భావోద్వేగాలకు చక్కని మెలోడీని జోడించి పాటను వినసొంపుగా తీర్చిదిద్దారు.

పూర్ణాచారి అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. విజయ్ బుల్గానిన్ తనదైన క్లాసీ మ్యూజిక్‌తో ప్రేమ భావనలకు ప్రాణం పోశారు. అనురాగ్ కులకర్ణి గాత్రం పాటకు మరింత మాధుర్యాన్ని తీసుకొచ్చింది. రొమాంటిక్ మెలోడీలను ఇష్టపడే సంగీత ప్రియులకు ఈ పాట మంచి అనుభూతిని అందించేలా ఉంది.

►ALSO READ | Reality Movie Audio Rights: రిలీజ్‌కు ముందే కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' రికార్డ్.. ఊహించని ధరకు ఆడియో రైట్స్ సేల్!

కృష్ణ పాత్రలో నితిన్ స్టైలిష్‌గా, స్మార్ట్‌గా కనిపిస్తుండగా.. రుక్మిణిగా ఆఫియా సయ్యద్ సహజమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఈ ప్రేమకథకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. డిసెంబర్ 4, 2026న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

'ధండోరా' సినిమాతో గుర్తింపు పొందిన మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి ఘంటా నిర్మిస్తున్నారు. తొలి పాటతోనే ప్రేమలోని మధురమైన అనుభూతులను పరిచయం చేసిన 'అలియాస్ రుక్మిణి'.. రాబోయే రోజుల్లో ఎలాంటి పాటలు, ప్రచార చిత్రాలతో సందడి చేస్తుందో చూడాలి.  వరుస ఆపజయాలతో నిరాశతో ఉన్న నితిన్ కు ఈ మూవీ సక్సెస్ ను అందిస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.