హైదరాబాద్ పేలుడు శబ్దాలతో దద్ధరిల్లింది. ఒక్కసారిగా శబ్దాలతో స్థానికంగా కలకలం రేపింది. భూకంపం వచ్చిందా, ఏదైనా పేలుడు జరిగిందా అనేది అర్థం కాక జనాలు పరుగులు తీశారు. 2026 అక్టోబర్ 27న ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఈ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామి నగర్ ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించాయి. బ్లాస్టింగ్‌ను తలపించేలా భారీ శబ్దం వచ్చినట్లు చెబుతున్నారు. ఒక్కసారిగా వినిపించిన శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఎక్కడైనా బ్లాస్టింగ్ జరిగిందా? లేక భూకంపం సంభవించిందా? అంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. భారీ శబ్దం వెనుక కారణం ఏమిటనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
