Good Food: పొద్దున్నే ఇవి తినండి.. కావలసినంత బలం.. పుష్కలంగా ఇమ్యూనిటీ పవర్

Good Food:  పొద్దున్నే ఇవి తినండి..  కావలసినంత బలం.. పుష్కలంగా ఇమ్యూనిటీ పవర్

పొద్దున్నే పెసలు, శెనగలు వంటి మొలకెత్తిన గింజలు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పర స్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్-సి, విటమిన్ -కె సరిపడినన్ని ఉంటాయి. మన బాడీకి చాలా అవసరం అయిన యాంటీ ఆక్సిడెంట్లు, అమైనోయాసిడ్స్ ఉంటాయి.

రాత్రి నానబెట్టి తెల్లారాక మూట కట్టి ఉంచాలి. రెండో రోజు తెరిచి చూస్తే మొలకలు వస్తాయి. వీటిని పొద్దున్నే తినడం వల్ల ఎక్కువ ఆకలి వేయదు. దీంతో మధ్యాహ్నం భోజనంతక్కువగా తింటాం. బరువు తగ్గాలను కున్నవాళ్లకి ఈ మొలకల డైట్ బాగా ఉపయోగ పడుతుంది.

  • డైజేషన్ సమస్యలున్నవాళ్లకిమొలకలు మెడిసిన్ లా పనిచేస్తాయి.ఇందులో ఇనుము, క్యాల్షియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
  • వీటిలో ఉండే ఒమెగా 3 ప్యాటీ యాసిడ్లు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి.. డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లకి మంచి ఫుడ్.
  • మొలకలు రెగ్యులర్ గా తినటం వల్ల మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉంటుంది.
  • డిప్రెషన్ లో ఉన్న వాళ్లు మొలకలను రెగ్యులర్ ఫుడ్ మెనులో చేర్చుకుంటే మంచిది.
  • మొలకల్లో ఇమ్యూనిటీ పవర్ ని పెంచే గు. ణాలున్నాయి. మొలకల్లోని విటమిన్-సి తెల్ల రక్తకణాలను యాక్టివ్ గా చేస్తుంది.
  • విటమిన్ ఎ కంటిచూపును బాగుచేస్తుంది.