ప్రళయంగా తీరం వైపు దూసుకొస్తున్న ఆర్నబ్ తుఫాన్

ప్రళయంగా తీరం వైపు దూసుకొస్తున్న ఆర్నబ్ తుఫాన్

దేశమంతా ఎల్ నినో కరువు పరిస్థితులకు భయపడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ను తుఫాన్ భయపెడుతోంది. బంగాళా ఖాతం మీదుగా ఏపీ తీరంవైపు ఆర్నబ్ తుఫాన్ దూసుకొస్తోంది.  తుఫాన్ కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను వాతావరణ కేంద్రం రిలీజ్ చేసింది. అత్యంత వేగంగా, తీవ్రతతో ప్రళయం మాదిరగా వస్తున్న తుఫాన్ ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే తుఫాన్ ఎంత తీవ్రతతో వస్తోంది.. గాలుల వేగం ఎంత.. అనే అంశాల గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆర్నబ్ తుఫాన్ ముఖ్యాంశాలు:

  • తుఫాన్ 2026 అక్టోబర్ 26 అర్థరాత్రి మరింత తీవ్రరూపం దాల్చనుంది
  • అక్టోబర్ 27న మరింత బలపడి ప్రళయ తుఫాన్ మాదిరిగా విజృంభించనుంది.
  • అక్టోబర్ 28న బాపట్ల, విశాఖపట్నం మధ్యలో యానాం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. 
 
  • తుఫాన్ గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 
  • గరిష్టంగా 140 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉంది. 
  • తుఫాన్ ఒడిశాలోని గోపాలపూర్ కు ఆగ్నేయంలో 610 కిమీ దూరంలో తుఫాన్
  •  ఏపీ విశాఖపట్నం తూర్పు ఆగ్నేయానికి 650 కిలోమీటర్ల దూరంలో ఉంది. 
  •  మచిలీపట్నంకు 790 కి.మీ., బాపట్లకు 860 కి.మీ దూరంలో కేంద్రీకృతం 
  • గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన తుపాన్ 
 
  • తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు IMD పేర్కొంది.
  • తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ 
  • తుఫాన్ ధాటికి ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చిరికలు.
  •  చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం
  • అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ ఎండీ, ప్రఖర్ జైన్ తెలిపారు. 
  • తుఫాన్ కదలికలపై IMD హెచ్చరికలను గమనించాలని సూచన