డిగ్రీ పూర్తయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. LIC హౌసింగ్ ఫైనాన్స్లో జాబ్స్

 డిగ్రీ పూర్తయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. LIC హౌసింగ్ ఫైనాన్స్లో జాబ్స్

 ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 232.

విద్యార్హత

అభ్యర్థులు 2026, అక్టోబర్ 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అయితే, ఈ డిగ్రీ 2001, అక్టోబర్ 1 కంటే ముందు పూర్తిచేసి ఉండకూడదు. అభ్యర్థులు ఇంతకుముందు ఏ ఇతర సంస్థలోనైనా రన్నింగ్, టెర్మినేటెడ్ లేదా పూర్తయిన అప్రెంటిస్‌షిప్ కాంట్రాక్టును కలిగి ఉండకూడదు.
వయసు: 2026, అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.200, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ. 800, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మహిళా అభ్యర్థులు రూ.600 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 1.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ: నవంబర్ 7. 
ఇంటర్వ్యూ: నవంబర్ 15. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్  nats.education.gov.inను సందర్శించండి.


ఎగ్జామ్ ప్యాటర్న్


ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ఈ ఎగ్జామ్ ఇంటి వద్ద నుంచే స్మార్ట్​ఫోన్ లేదా కెమెరా సదుపాయం ఉన్న డివైజ్ ద్వారా రాసే విధంగా రిమోట్-ప్రొటోర్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. 60 నిమిషాల్లో  పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 4 భాగాలు ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి.