మోదీ కా బాప్ భీ జాయేగా..మల్లికార్జున ఖర్గే కామెంట్స్

మోదీ కా బాప్ భీ జాయేగా..మల్లికార్జున ఖర్గే కామెంట్స్

పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిహార్ తొలి ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీకృష్ణ సింగ్ జయంతి వేడుకల్లో ఖర్గే ప్రసంగిస్తుండగా, ఒక వ్యక్తి అంతరాయం కలిగించారు. పీఎం మోదీ ఎక్కడికీ వెళ్లరంటూ కామెంట్స్ చేయడంతో తీవ్రంగా స్పందించిన ఏఐసీసీ ప్రెసిడెంట్.. ఆగ్రహంతో మోదీ కా బాప్ భీ జాయేగా అంటూ ఫైర్‌‌‌‌ అయ్యారు.

ఈ సభలో మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దీనిని రెండో స్వాతంత్ర్య సమరం అని అభివర్ణించారు. ఎన్నికల్లో పారదర్శకత పెంచడానికి, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని కోరారు. గత రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని, పశ్చిమ బెంగాల్, హర్యానా, బిహార్, మహారాష్ట్రలో ఓట్ల చోరీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలను తొలగించాలని డిమాండ్ చేశారు.