రామాంతాపూర్ స్క్రాప్ షాపులో పేలుడు ..గ్యాస్ కట్టర్ తో మెటల్ కట్ చేస్తుండగా బ్లాస్ట్..ఒకరికి తీవ్ర గాయాలు

రామాంతాపూర్ స్క్రాప్ షాపులో పేలుడు ..గ్యాస్ కట్టర్ తో మెటల్ కట్ చేస్తుండగా బ్లాస్ట్..ఒకరికి తీవ్ర గాయాలు

ఉప్పల్, వెలుగు : హైదరాబాద్​రామాంతాపూర్​చర్చి కాలనీలోని ఓ స్క్రాప్​షాపులో పేలుడు సంభవించింది. ఆదివారం షాపు యజమాని పరుశురాం (43) ఓ మెటల్​వేస్టేజీని గ్యాస్​కట్టర్​తో  కట్​చేస్తుండగా అది అకస్మాత్తుగా పేలింది. దీంతో మంటలు చెలరేగి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన శరీరం 50 నుంచి 70 శాతం వరకు కాలిపోయింది. 

గమనించిన చుట్టుపక్కల వారు అతడిని స్థానికులు గాంధీ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్​ఫైటర్స్​రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడు శబ్దంతో పాటు దుకాణంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు చెప్పారు.  ప్రమాద తీవ్రత దృష్ట్యా సీనియర్ పోలీస్ ఆఫీసర్లు, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇళ్ల మధ్యలో ఉన్న స్క్రాప్ షాపులో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.