అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎగ్జామ్ పెట్టాలె ..లేకపోతే అక్రమాలు జరిగే అవకాశం

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు  ఎగ్జామ్ పెట్టాలె ..లేకపోతే అక్రమాలు జరిగే అవకాశం
  • పోస్టులను అమ్ముకుంటరు
  • నిరుద్యోగ హక్కుల వేదిక  రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ 

 ఓయూ, వెలుగు : అకాడమిక్ మార్కుల ద్వారా కాకుండా పరీక్ష ద్వారానే డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిరుద్యోగులతో కలిసి నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ మాట్లాడారు. 

టీచింగ్ లో అత్యున్నత ఉద్యోగాలైన డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కాలంటే పరీక్షలు నిర్వహించాలన్నారు. అకాడమిక్​కు 50 మార్కులు, డెమోకు30, ఇంటర్వ్యూ20 మార్కులు కేటాయించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, దీని ద్వారా అక్రమాలు జరిగి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. 

యూజీసీ నిబంధనల పేరుతో ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలను అమ్ముకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని, తక్షణమే జీవో నెంబర్ 31 రద్దుచేసి, స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 1:5 అభ్యర్థులను సెలెక్ట్ చేయాలని, ఆ తర్వాత డెమో ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ రమేశ్, శ్రీకాంత్ రెడ్డి, నాగేంద్ర చారి, నరసింహ గౌడ్, విద్యాసాగర్, సారంగం వెంకటేశం, విన్నర్ చోళ, ప్రణీత్ కిరణ్ రాథోడ్ పాల్గొన్నారు.