ISROలో టెక్నీషియన్, డ్రైవర్‌ ఉద్యోగాలు.. 18 నుంచి 35 ఏళ్ల వారికి అవకాశం!

ISROలో టెక్నీషియన్, డ్రైవర్‌  ఉద్యోగాలు.. 18 నుంచి 35 ఏళ్ల వారికి అవకాశం!

శ్రీహరికోటలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్​హెచ్ఏఆర్ (ఎస్​డీఎస్​సీ ఎస్​హెచ్ఏఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 97 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కాగా అభ్యర్థులు నవంబర్ 9 వరకు ఆన్‌‌‌‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

మొత్తం ఖాళీలు: 97.

విభాగాల వారీగా ఖాళీలు
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 16, టెక్నీషియన్ –బి 43, హెవీ వెహికల్ డ్రైవర్– ఏ 7, టెక్నికల్ అసిస్టెంట్ 14, సైంటిఫిక్ అసిస్టెంట్ 3, నర్స్– బి 3, లైబ్రరీ అసిస్టెంట్– ఏ 3, లైట్ వెహికల్ డ్రైవర్– ఏ (ఏడీఆర్ఐఎన్) 4, ఫైర్‌‌‌‌మెన్– ఏ 2, డ్రాఫ్ట్స్​మన్– బి 1, లైట్ వెహికల్ డ్రైవర్– ఏ 1.

విద్యార్హతలు
టెక్నికల్ అసిస్టెంట్: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాసులో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

సైంటిఫిక్ అసిస్టెంట్: ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్టుగా, మ్యాథ్స్, కెమిస్ట్రీలు యాన్సిలరీ సబ్జెక్టులుగా ఫస్ట్ క్లాసులో బీఎస్సీ, ఫస్ట్ క్లాసులో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఫొటోగ్రఫీ) లేదా విజువల్ ఆర్ట్స్ (సినిమాటోగ్రఫీ)లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

లైబ్రరీ అసిస్టెంట్–ఏ:  అభ్యర్థులు ఫస్ట్ క్లాస్‌‌‌‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా సమాన గుర్తింపు పొందిన కోర్సులో ఫస్ట్ క్లాస్‌‌‌‌తో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

నర్స్: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫస్ట్ క్లాసుతో డిప్లొమా ఇన్ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, సంబంధిత రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌‌‌‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం తప్పనిసరి.

టెక్నీషియన్: ఎస్ఎస్​సీతోపాటు ఎన్​సీవీటీ  పరిధిలోని నోటిఫైడ్ ట్రేడ్‌‌‌‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.

డ్రాఫ్ట్స్​మెన్: ఎస్ఎస్​సీతోపాటు  డ్రాఫ్ట్స్​మెన్ (సివిల్) ట్రేడ్‌‌‌‌లో ఐటీఐ / ఎన్​టీసీ/ ఎన్ఏసీ అర్హత కలిగి ఉండాలి.

ఫైర్​మెన్: పదోతరగతితోపాటు నిర్దేశిత శారీరక దారుఢ్య పరీక్షలు, స్టాండర్డ్స్ కలిగి ఉండాలి.

లైట్ వెహికల్ డ్రైవర్–ఏ: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు, లైట్ వెహికల్ డ్రైవర్‌‌‌‌గా మూడేళ్ల అనుభవం, చెల్లుబాటు అయ్యే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

హెవీ వెహికల్ డ్రైవర్–ఏ: పదో తరగతి ఉత్తీర్ణత, కనీసం మూడేళ్లు హెవీ వెహికల్ డ్రైవర్‌‌‌‌గా పనిచేసిన అనుభవంతో కలిపి మొత్తం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. అలాగే, చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, అవసరమైన చోట పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్  కలిగి ఉండటం తప్పనిసరి.

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు (2026, నవంబర్ 9 నాటికి)
ఫైర్ మెన్–ఏ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
మిగతా పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్, పీడబ్ల్యూబీడీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, స్పోర్ట్స్ పర్సన్స్​కు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్‌‌‌‌లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 19.

లాస్ట్ డేట్: నవంబర్ 9.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అర్హత పరీక్ష మాత్రమే), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌‌‌‌సైట్ shar.gov.inను సందర్శించండి.