వెరైటీ నాన్ వెజ్రెసిపీ: కోడి కొబ్బరి కారం.. ఒక్కసారి తింటే కొన్ని నెలల పాటు అనుభూతి చెందాల్సిందే.!

వెరైటీ నాన్ వెజ్రెసిపీ:  కోడి కొబ్బరి కారం.. ఒక్కసారి తింటే కొన్ని నెలల పాటు అనుభూతి చెందాల్సిందే.!

దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.. మరో కొద్ది రోజుల్లో కార్తీకమాసం మొదలవుతుంది.  చాలామంది హిందువులు..కార్తీకమాసంలో నాన్​ వెజ్​ తినరు.  మరి అలాంటప్పుడు.. ఒక్కసారి తింటే కొన్ని నెలలపాటు అనుభూతిని ఆస్వాదించే నాన్​ వెజ్​ రెసిపీని టేస్ట్​ చేయాలనుకుంటున్నారా.. రెగ్యులర్​ గా చికెన్​ కూరలు.. ఫ్రై అంటే ఏముంటుంది.  రొటీన్​ ఫుడ్డేగా  మరి.. మరి వెరైటీ కోడి కొబ్బరి కారాన్ని ఇంట్లోనే వెరైటీగా తయారు చేసుకొని తిన్నారంటే నా సామిరంగా.. కొన్ని నెలల పాటు ఆ అనుభూతి ఉండాల్సిందే.. మరి ఇంకెందుకు ఆలస్యం.. అలాంటి కోడి కొబ్బరి కారాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .!

కోడి కొబ్బరి కారం తయారీకి కావాల్సినవి

  • ఎండుమిర్చి - 10
  •  అల్లం - 2 అంగుళాల ముక్క 
  • వెల్లుల్లి రెబ్బలు 20 
  • ఉల్లిపాయలు - 2
  •  ఉప్పు - రుచికి తగినంత 
  • పసుపు - అర  టీస్పూన్ 
  • కారం - 2  టేబుల్ స్పూన్లు 
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు 
  • గరం మసాలా - 2 టీస్పూన్లు 
  • చికెన్ -  కేజీన్నర
  •  నిమ్మకాయలు- 2 
  •  నూనె - 10టేబుల్ స్పూన్లు 
  • తురిమిన పచ్చి కొబ్బరి - 2 కప్పులు
  •  కరివేపాకు - కొద్దిగా
  •  కొత్తిమీర - కొద్దిగా

కోడి కొబ్బరి కారం తయారీ విధానం 

మార్కెట్​ నుంచి చికెన్​తీసుకొచ్చిన తరువాత  దానిలో కొద్దిగా చిటికెడు ఉప్పు, పసుపును చికెన్​ బాగా పట్టేలా కలిపి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  ఇలా చేయడం వలన చికెన్​ కు ఉన్న డస్ట్​ పోతుంది.  

ఇప్పుడు శుభ్రమైన చికెన్​ లో ధనియాల పొడి, గరంమసాలా, కారం, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నిమ్మరసం పిండి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

మిక్సీ జార్ లో ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు ముక్కలు వేసి మెత్తగా పేస్ట్​చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్​ వెలిగించి వెడల్పాటి కళాయిలో చికెన్​ ముక్కలను వేయించేందుకు సరిపడ నూనె పోసి వేడి చేయాలి.  

నూనె వేడెక్కిన తరువాత చికెన్​ ముక్కలను అందులో వేయాలి.   అయితే చికెన్​ ముక్కలులు కళాయిలో ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకుంటే ఈ  రెసిపీ బాగా రుచిగా ఉంటుంది.  
చికెన్​ అన్ని వైపులా సమానంగా  సెమీ డీప్ ఫ్రై వేగేంతవరకుముక్కలను అటూ ఇటూ తిప్పుతూ బాగా ఎర్రగా ఫ్రై చేయాలి.

చికెన్​ ముక్కలు మంచి రంగు వచ్చిన తరువాత మిక్సీ పట్టిన ఎండిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్ట్​ ను ఇందులో వేసి పచ్చి వాసన పోయేవరకు సన్నని మంటపై బాగా వేయించుకోవాలి.  ఆ తరువాత దీనిపైన కరివేపాకు వేయాలి.

మసాలా చికెన్​ కు మొత్తం పట్టేలా పైకి కిందకు కలుపుతూ నూనె పైకి తేలే సమయంలో పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి.  కొబ్బరి వేగేంత వరకు సన్నని మంటపై చికెన్​ ముక్కలు.. కొబ్బరి తురుము కలిసేలా వేయిస్తూ కలపాలి.  ఇలా అయిన తరువాత మరో ఐదు నిమిషాలు రోస్ట్​గా వేగిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీరను ఈ చికెన్​ ముక్కలపై చల్లాలి. అంతే ఇక కోడి కొబ్బరి కారం రెడీ. 

ఈ వెరైటీ కోడి కొబ్బరి కారాన్ని  వేడి వేడి అన్నంలోకి గానీ, బిర్యానీ, చపాతీల్లోకి గానీ ఇది అద్భుతంగా ఉంటుంది. ముక్క మెత్తగా, జ్యూసీగా చూస్తూనే నోట్లో నీళ్లూరిపోయేలా ఉంటది. మరి ఇంకెందుకు ఆలస్యం ఓ సారి ట్రై చేయండి...!