ఇండియన్ ఫ్యామిలీస్ తమ ఇళ్లలో తరతరాలుగా వాడుతున్న సామాన్యమైన స్టీల్ ప్లేట్‌ను.. అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ 'చిక్ క్రోమ్ ప్లేట్' అంటూ సరికొత్తగా పరిచయం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విదేశాల్లో దీన్ని ఓ ఫ్యాషనబుల్ టేబుల్‌వేర్‌గా ప్రదర్శిస్తుండటంపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అమండా మోన్సెన్ ఐకియాకు చెందిన స్టెయిన్‌లెస్-స్టీల్ ప్లేట్‌లను ప్రదర్శిస్తూ.. ఇవి మోడర్న్ ఇంటీరియర్స్‌కు సరిపోయే స్టైలిష్ క్రోమ్ ప్లేట్లు అని, వీటిని ఆహారం వడ్డించడానికి ఉపయోగించవచ్చని చెప్పారు. అయితే ఈ ప్లేట్లను చూసిన భారతీయులు ఇవి మన ఇళ్లలో వాడే సాధారణ 'స్టీల్ తాలి' (భోజనం చేసే పళ్లెం) అని వెంటనే గుర్తించి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఐకియా వీటిని సాధారణ స్టెయిన్‌లెస్-స్టీల్ ప్లేట్‌లుగా విక్రహిస్తుండగా.. ఒక్కో ప్లేట్ ధర దాదాపు రూ.760 వరకు ఉండటం నవ్వు తెప్పిస్తోంది.
First it was Kolhapuri chappals, then dupattas, and now IKEA is selling our steel thali as a "chic chrome plate." for Rs 760. Can’t wait for IKEA to drop the "Aerodynamic Dough-Flattening Wand" (our humble belan) for ₹4,500. It may come with a warning label: “Not to be used by indian wives as a missile on their husbands.” 💀😜
— Harsh Goenka (@hvgoenka) October 25, 2026
ఈ ట్రెండ్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ వేదికగా చాలా సరదాగా స్పందించారు. "మొదట్లో కొల్హాపూరి చప్పల్స్, ఆ తర్వాత దుపట్టాలు.. ఇప్పుడు ఐకియా మన స్టీల్ తాలిని 'చిక్ క్రోమ్ ప్లేట్' పేరుతో రూ.760కి అమ్ముతోంది. త్వరలోనే ఐకియా చపాతీ కర్రను 'ఏరోడైనమిక్ డోవ్-ఫ్లాటెనింగ్ వాండ్' పేరుతో రూ.4వేల 500కి మార్కెట్లోకి తెస్తుంది" అంటూ సెటైర్లు వేశారు. అంతేకాకుండా ఆ చపాతీ రోలర్ కర్రలపై “భర్తలపై భార్యలు మిస్సైల్ మాదిరిగా ప్రయోగించడానికి వీలులేదు” అనే హెచ్చరిక లేబుల్ కూడా ఉండొచ్చని చమత్కరించారు.
మన దేశంలో దశాబ్దాలుగా ప్రజలు వాడుతున్న వస్తువులను.. విదేశీ బ్రాండ్లు సరికొత్త పేర్లు పెట్టి, మోడర్న్ మార్కెటింగ్ చేయడంతో వాటి రూపమే మారిపోయినట్లు కనిపిస్తోంది. రోజువారీ వస్తువులకు బ్రాండింగ్, ప్రెజెంటేషన్ తోడైతే అవి ఏవిధంగా ఖరీదైన లైఫ్‌స్టైల్ యాక్ససరీస్‌గా మారుతాయనేదానికి ఈ ఘటనే చక్కటి ఉదాహరణ అంటున్నారు నెటిజన్లు.
