దసరా ముగియగానే భారీగా తగ్గిన బంగారం రేట్లు మళ్లీ తిరిగి పుంజుకుంటున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో కేజీకి రూ.4 లక్షలు దాటిన వెండి.. ప్రస్తుతం నేలచూపులు చూస్తూ రూ.లక్షా 90వేల స్థాయికి చేరుకుంది. దీంతో దాదాపు గరిష్ఠాల నుంచి 50 శాతం మేర వెండి పడిపోవటం కొనుగోలుదారులకు సంతోషాన్ని ఇస్తోంది. వెండి జ్యువెలరీ, వెండి వస్తువులు కొనాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశంగా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో బంగారం షాపింగ్ చేసేటోళ్లు ముందుగా తమ నగరాల్లో మారిన రేట్లను పరిశీలించటం బెటర్.
అక్టోబర్ 26న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.17 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 275గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 085గా కొనసాగుతోంది.
ALSO READ : AIతో ఇక నావల్ల కాదు.. వెళ్లి పొలం పనులు చేసుకుంటా
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 26, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 20వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.220 దగ్గర ఉంది.
