ఈ వారం మరో 5 ఐపీఓలు , రూ.2,600 కోట్ల సేకరణ
న్యూఢిల్లీ: దేశీయ ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల జోరు కొనసాగుతోంది. ఈ వారం మరో 5 సంస్థలు ఐపీఓల ద్వారా సుమారు రూ.2,600 కోట్లను సేకరించనున్నాయి. వీటిలో ఎడెల్‌వైస్ గ్రూప్‌నకు చెందిన ఈఏఏఏ ఇండియా ఆల్టర్నేటివ్స్ (సైజ్ రూ.1,200 కోట్లు), ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్ (రూ.668 కోట్లు), ఎం కే సన్స్ ఫైన్ జ్యువెల్స్ (రూ.275.4 కోట్లు), బీఎల్ఎస్ పాలిమర్స్ (రూ.255 కోట్లు), బాంబే కోటెడ్ అండ్ స్పెషల్ స్టీల్స్ (రూ.183.1 కోట్లు) ఉన్నాయి.
ఈ ఇష్యూలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 మధ్య ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించేందుకు, వర్కింగ్ క్యాపిటల్, రుణాల చెల్లింపుల కోసం కంపెనీలు ఈ నిధులను వాడనున్నాయి. నవంబర్‌లో దీపావళి సెలవులకు ముందే గుజరాత్ విక్టరీ ఫోర్జింగ్, మైల్‌స్టోన్ గేర్స్ తదితర కంపెనీలు తమ ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించే వీలుంది. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు 104 కంపెనీలు ఐపీఓల ద్వారా ఏకంగా రూ.1.4 లక్షల కోట్లకు పైగా నిధులు సేకరించడం
విశేషం. ఈ వారం జియో షేర్ల లిస్టింగ్ ఉంది.
