ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తున్నాడు. అక్టోబర్ 23న బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకున్న ఆయన.. ప్రస్తుతం యూరప్ ట్రిప్‌లో ఉన్నాడు. లండన్, ప్యారిస్ వంటి ప్రాంతాల్లో రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడట.
భారీ సినిమాల షూటింగ్స్‌తో నిరంతరం బిజీగా ఉండే ప్రభాస్.. అప్పుడప్పుడు యూరప్ ట్రిప్స్‌కు వెళ్లి సేదతీరడం కొత్తేమీ కాదు. ‘ఫౌజీ’ టీజర్ విడుదల, వరుస షూటింగ్స్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మిగిలిన షూటింగ్‌లో పాల్గొంటాడు.
అనంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్పిరిట్’పై దృష్టి పెట్టనున్నాడు. ఇలా సినిమాల విషయంలో ఫుల్ బిజీగా ఉంటూనే, మధ్యమధ్యలో రిలాక్స్ అవుతూ తన తదుపరి ప్రాజెక్టులకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
