నీతోడు ఉంటే రంగులు రంగులే

నీతోడు ఉంటే రంగులు రంగులే

రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన  చిత్రం ‘రామాయణం’.  నితేష్ తివారీ  దర్శకత్వం వహించిన  ఈ చిత్రాన్ని    ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెగ్, మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో  నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నారు.  రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ  ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపావళి సందర్భంగా నవంబర్ 5న పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానుంది. 

తెలుగు రాష్ట్రాల్లో  దిల్ రాజు విడుదల చేస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం నుంచి  ‘రంగులు రంగులే’ అంటూ సాగే  పాట విడుదలైంది.  శ్రీరాముడు, సీతమ్మ ప్రేమానుబంధాన్ని అద్భుతమైన విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆవిష్కరించిన ఈ పాటకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాఘవ్ కౌశిక్, వైశాలి సామంత్ పాడగా,  రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. 

హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.  ‘నీతోడు ఉంటే రంగులు రంగులే’ అంటూ ప్రేమ, భక్తి భావాలతో సాగిన పాట ఆకట్టుకుంటోంది. యశ్ రావణుడిగా,  సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.