విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రుహానీ శర్మ.. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. రీసెంట్‌గా ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె బిజిలీ పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించారు. కిటికీ పక్కన కూర్చుని సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న రుహానీ శర్మ ఈ పోస్టర్‌లో ఎంతో సహజంగా, అందంగా ఆకట్టుకుంటుంది.
హడావుడి లేని ప్రశాంతమైన లుక్‌తో ఆమె పాత్రను పరిచయం చేసిన తీరు ప్రత్యేకంగా నిలుస్తోంది. కథలో అనుకోని సమయంలో ప్రవేశించి, ఆ ప్రయాణానికి కొత్త వెలుగును తీసుకొచ్చే పాత్రగా బిజిలీని మేకర్స్ పరిచయం చేయడంతో.. సినిమాలో రుహానీ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ‘ఒక అనుకోని పరిచయం.. ఊహించని అందమైన అనుభూతులు’ అనే ఆసక్తికరమైన నేపథ్యంతో బిజిలీ పాత్రను పరిచయం చేస్తుండటం ఈ ఫస్ట్ లుక్‌కు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 20న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
