పెద్దషాపూర్‌‌లో దొంగ నోట్ల పట్టివేత.. గండిపేట పరిధిలో ఘటన

పెద్దషాపూర్‌‌లో దొంగ నోట్ల పట్టివేత.. గండిపేట పరిధిలో ఘటన

గండిపేట, వెలుగు: పెద్ద షాపూర్ పీఎస్​పరిధిలో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్​చేసి రూ.1.34 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పాలమాకులలోని పి-1 రోడ్డు సమీపంలో నకిలీ కరెన్సీతో ఓ వ్యక్తి వస్తున్నాడని సమాచారం అందడంతో నిఘా వేసి పట్టుకున్నారు. అతడి దగ్గర రూ.1,34,000 విలువైన నకిలీ రూ.500 రూ.200 దొంగ నోట్లు దొరికాయి. 

నిందితుడిని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని టీఎన్జీవోస్ కాలనీకి చెందిన సందీప్ (36)గా గుర్తించారు.  ఓ మహిళ వద్ద తాను డెలివరీ ఏజెంట్‌‌గా పనిచేస్తున్నట్లు, ఆమె తనకు కమిషన్​ఇస్తోందని వెల్లడించాడు.  నిందితుడిని కేసు నమోదు చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు పెద్ద షాపూర్ సీఐ వై. సురేందర్ రెడ్డి, ఎస్​ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.