418తో వెరీ హ్యాపీ.. సినిమాకు మంచి రెస్పాన్స్

418తో వెరీ హ్యాపీ.. సినిమాకు మంచి రెస్పాన్స్

దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ  మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ నిర్మించిన  హారర్ మూవీ ‘418’.   కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన  ఈ చిత్రంలో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ‘పతంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు.   అక్టోబర్ 23న  విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  రన్ అవుతోందని మేకర్స్ తెలియజేశారు.  

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   మైత్రీ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘ఈ  సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.  మా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  చేసిన ఫస్ట్ హారర్ సినిమా ఇది.  యంగ్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేసి హిట్ వస్తే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ సినిమా మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది’ అని అన్నారు.   

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘ఈ  సినిమా బాగుందని అందరూ అంటున్నారు. అదే సమయంలో సౌండ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.  పాజిటివ్  మౌత్ టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిన  ఈ సినిమా రెండు మూడు వారాల రన్ వుంటుంది. మైత్రీలో మరో విభిన్నమైన సినిమా చేశామని తృప్తిగా ఉంది. మంచి సౌండ్ ఉన్న థియేటర్లలో  సినిమా చూస్తే  నెక్స్ట్ లెవల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఇస్తుంది’ అని అన్నారు.  ఈ చిత్రానికొస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చిందని దర్శకుడు కీర్తన్ నాదగౌడ, నటి ప్రీతి పగడాల చెప్పారు.  మైత్రీ శశిధర్ రెడ్డి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.