గతంలో గెలిచిన వాళ్లు ఏం చేసినట్టు..ఉద్యోగ, నిరుద్యోగుల పక్షాన ఎందుకు ప్రశ్నించలే..

గతంలో గెలిచిన వాళ్లు ఏం చేసినట్టు..ఉద్యోగ, నిరుద్యోగుల పక్షాన  ఎందుకు ప్రశ్నించలే..
  • అందుకే సమర్థులనే ఎన్నుకోవాలి 
  • తెలంగాణ లెక్చరర్స్ ఫోరం     చైర్మన్ కత్తి వెంకటస్వామి

ముషీరాబాద్,వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెక్చరర్స్ క్రియాశీలకంగా పనిచేసి సమర్థులయిన అభ్యర్థులనే ఎన్నుకోవాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

 ఆయన మాట్లాడుతూ అధ్యాపక, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, పట్టుభద్రుల సమస్యల సాధన పోరాటానికి తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఎల్లప్పుడు ముందుంటుందన్నారు. గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఉద్యోగ, నిరుద్యోగుల పక్షాన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. 

మండలిలో ఈ సమస్యలపై పోరాడి ఉంటే సమస్యలు ఎప్పటిలాగే ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. అధ్యక్షుడు ఎం రామకృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి, బి వేణు, పి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.